Vanaparthy : మహిళతో ఏకాంతంగా దొరికిన ఎస్ఐ.. చితకబాదిన బంధువులు

తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ ఎస్ఐని భర్త అతడి స్నేహితులు చితకబాదారు. ఈ ఘటన వనపర్తి జిల్లా కొత్తకోటలో జరిగింది.

Vanaparthy : మహిళతో ఏకాంతంగా దొరికిన ఎస్ఐ.. చితకబాదిన బంధువులు

Vanaparthy

Vanaparthy : తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ ఎస్ఐని భర్త అతడి స్నేహితులు చితకబాదారు. ఈ ఘటన వనపర్తి జిల్లా కొత్తకోటలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. కొత్తకోటకు చెందిన మహిళతో వనపర్తి రూరల్ ఎస్ఐ షేక్ షఫి వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారు. ఈ విషయం సదరు మహిళ భర్తకు తెలిసింది. ఇద్దరిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకునే అవకాశం కోసం వేచి చూశాడు.

చదవండి : Visakha TDP Office : విశాఖ టీడీపీ ఆఫీసులో పోలీసుల సోదాలు

ఈ నెల 18న మహిళను కలిసేందుకు ఎస్ఐ షఫీ ఆమె ఇంటికి వెళ్ళాడు. అవకాశం కోసం ఎదురుచూస్తున్న భర్తకు ఎస్ఐ ఇంట్లోకి వచ్చాడన్న విషయం తెలిసింది. దీంతో కుటుంబ బంధువులు స్నేహితులకు సమాచారం ఇచ్చాడు. ఎస్ఐ షఫీ భార్యతో ఉన్న సమయంలో ఇంట్లోకి వచ్చి చితకబాదారు.

చదవండి : Visakha Girl Died : ప్రేమోన్మాది చేతిలో గాయపడిన యువతి మృతి

ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎస్ఐని కొడుతుండగా అడ్డుకున్న సదరు మహిళ చెంప చెళ్లుమనిపించారు. విషయం పోలీసులకు తెలియడంతో ఘటన స్థలికి చేరుకొని.. గాయపడిన ఎస్ఐ వనపర్తి ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి హైదరాబాద్ తరలించారు. విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో ఎస్ఐని సస్పెండ్ చేశారు.