Venkatrama Reddy : అందుకే రాజీనామా, కేసీఆర్ ఆదేశాలు రాగానే టీఆర్ఎస్‌లో చేరతా

తాను టీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నానని సిద్ధిపేట మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి చెప్పారు. సీఎం కేసీఆర్ నుంచి పిలుపు అందిన వెంటనే పార్టీలో చేరతానని అన్నారు. గత 26 ఏళ్లలో..

Venkatrama Reddy : అందుకే రాజీనామా, కేసీఆర్ ఆదేశాలు రాగానే టీఆర్ఎస్‌లో చేరతా

Venkatrama Reddy

Venkatrama Reddy : తాను టీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నానని సిద్ధిపేట మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి చెప్పారు. సీఎం కేసీఆర్ నుంచి పిలుపు అందిన వెంటనే పార్టీలో చేరతానని అన్నారు. గత 26 ఏళ్లలో అన్ని ప్రభుత్వాలలో పని చేశానని ఆయన చెప్పారు.

రాష్ట్ర ప్రజల అభ్యున్నతి కోసం కేసీఆర్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని వెంకట్రామిరెడ్డి కొనియాడారు. దేశం మొత్తం తెలంగాణ వైపు చూసేలా కేసీఆర్ తీర్చిదిద్దుతున్నారని అన్నారు. రానున్న వందేళ్లు తెలంగాణ గురించి చెప్పుకునేలా కేసీఆర్ అభివృద్ధి చేస్తున్నారని కితాబిచ్చారు. ఈ అభివృద్ధి పయనంలో కేసీఆర్ వెంట ఉండాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. కేసీఆర్ మార్గనిర్దేశం ప్రకారం పని చేస్తానని తెలిపారు.

సిద్ధిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి ఐఏఎస్ ఉద్యోగానికి రాజీనామా చేశారు. తన రాజీనామాను సీఎం సోమేశ్ కుమార్ కు పంపారురు. ఆ వెంటనే ఆయన రాజీనామాను ప్రభుత్వం ఆమోదించడం జరిగింది. వెంకట్రామిరెడ్డికి కేసీఆర్ ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఐఏఎస్ కు ఆయన రాజీనామా చేసినట్టు సమాచారం.

Copper : రాగిపాత్రలో నీళ్ళు తాగితే రోగాలు మాయం?

” తెలంగాణను అణువణువు అర్ధం చేసుకున్న వ్యక్తి సీఎం కేసీఆర్.. ఏదైనా ఒక ప్రోగ్రాం, ప్రాజెక్ట్ చేపట్టాలంటే సీఎం తన అపార అనుభవంతో తెలంగాణ అభివృద్ధి చేశారు. సిద్దిపేటలో జరిగిన ప్రతి కార్యక్రమాన్ని ఎలా చేయాలి… ఎలా ముందుకెళ్లాలి అనేది సీఎం కేసీఆర్ విజన్ తో మేము నడుచుకున్నాం. సీఎం కేసీఆర్ అభివృద్ధిలో రాష్ట్రాన్ని దేశంలోనే రోల్ మాడల్ గా తీర్చిదిద్దారు. సీఎం కేసీఆర్ ఆలోచన విధానంతో ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు అందాయి.

Tongue Color : ఆరోగ్యాన్ని చెప్పే నాలుక రంగు..

దేశంలోని ప్రతి రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి చూశాను. తెలంగాణలో అంతకంటే ఎక్కువ అభివృద్ధి జరుగుతుంది. అందులో నేను భాగస్వామ్యం కావాలని రాజకీయాల్లోకి వస్తున్నా. రాష్ట్రంలో అభివృద్ధి కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. నా 26 సంవత్సరాల సర్వీస్ లో ఈ 7 సంవత్సరాలు నాకు సంతృప్తి ని ఇచ్చింది. పదవులు శాశ్వతం కాదు. సీఎం కేసీఆర్ ఏ పదవి ఇచ్చిన నా వంతు కృషి చేస్తాను” అని వెంకట్రామిరెడ్డి అన్నారు.