Wedding : గప్ చుప్‌‌గా పెళ్లిళ్లు

ఇంకెన్నీ రోజులు ఉండాలి..పెళ్లి చేసుకోకుండా..ముహుర్తాలు వెళ్లిపోతున్నాయి. ఇక ఆలస్యం చేయొద్దు..తమ వాళ్లకు పెళ్లిళ్లు చేయాలని తల్లిదండ్రులు భావిస్తున్నారు. సెలెంట్ గా పెళ్లి భాజాలు మ్రోగుతున్నాయి.

Wedding : గప్ చుప్‌‌గా పెళ్లిళ్లు

Marriges

Corona Second Wave : ఇంకెన్నీ రోజులు ఉండాలి..పెళ్లి చేసుకోకుండా..ముహుర్తాలు వెళ్లిపోతున్నాయి. ఇక ఆలస్యం చేయొద్దు..తమ వాళ్లకు పెళ్లిళ్లు చేయాలని తల్లిదండ్రులు భావిస్తున్నారు. సెలెంట్ గా పెళ్లి భాజాలు మ్రోగుతున్నాయి. కొద్ది మంది బంధువులు, అత్యంత సన్నిహితుల మధ్యే గప్ చుప్ గా పెళ్లిళ్లు జరిపించేస్తున్నారు. ఎలాంటి హడావుడి లేకుండా..వివాహాలు జరుగుతున్నాయని సమాచారం. ఎందుకంటే..కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రభుత్వాలు పలు నిబంధనలు, కఠిన ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.

గత సంవత్సరం వచ్చిన కరోనా వైరస్ ఇంకా తగ్గుముఖం పట్టలేదు. ఇంకా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత ఏడాది మంచి ముహూర్తాలున్నా..పెళ్లిళ్లలను చాలా మంది తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. ఈ సంవత్సరం తమ కూతురు, కుమారులకు పెళ్లిళ్లు చేద్దామని అనుకున్నా వైరస్ ఏ మాత్రం తగ్గలేదు. పలు రాష్ట్రాలు లాక్ డౌన్ విధించాయి. ప్ర‌భుత్వ అనుమ‌తుల ప్ర‌కారం గ‌రిష్టంగా 50 మంది అతిథుల‌తో పెళ్లి వేడుక‌లు చేసుకోవ‌చ్చని వెల్లడిస్తున్నాయి. కానీ

..మంచి ముహుర్తాలు ఉండడంతో పెళ్లిళ్లు జరిపించాలని పెద్దలు నిర్ణయిస్తున్నారు. పెద్ద పెద్ద కళ్యాణ మండపాల్లో కాకున్నా..చిన్న చిన్న మండపాల్లో వివాహాలు జరిపించేస్తున్నారు. ఎక్కువ మంది అతిథులు లేకున్నా..వరుడి తరపు నుంచి పది మంది, వధువు తరపున మరో పది మంది హాజరయితే..ఒకేనంటున్నారు.

గతంలో లక్షల రూపాయలు ఖర్చయితే..ఇప్పుడు ఆ ఖర్చు తక్కువగానే అవుతోంది. సింపుల్ గా పెళ్లిళ్లు కానిచ్చేస్తున్నారు. మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబాలకు కొంత ఊరటకలుగుతోంది. చివరకు గుళ్లో కూడా మూడు ముళ్లు వేసేస్తున్నారు. మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబాల‌కు పెళ్లి ఖ‌ర్చులు త‌గ్గుతున్నాయి. ఇన్నాళ్లు ఎదురు చూసిన వాళ్లు..ఇక వేచి ఉండలేక…సెలైంట్ గా, సింపుల్ గా పెళ్లిళ్లు జరిపించేస్తున్నారు.

Read More : Long Working Hours : కొవిడ్-19 ఎఫెక్ట్ : ఎక్కువ గంటలు పనిచేసేవారు ఏడాదికి లక్షలాది మంది చనిపోతున్నారు