Bonus : ఈ నెల 11న సింగరేణి కార్మికులకు బోనస్ చెల్లింపు

ఈ నెల 11న సింగరేణి కార్మికులకు బోనస్‌ చెల్లించనున్నట్లు సంస్థ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ శ్రీధర్‌ తెలిపారు. సగటున ఒక్కో కార్మికుడికి రూ.1.15 లక్షల వరకు చెల్లించనున్నట్లు

Bonus : ఈ నెల 11న సింగరేణి కార్మికులకు బోనస్ చెల్లింపు

Singareni

Bonus : ఈ నెల 11న సింగరేణి కార్మికులకు బోనస్‌ చెల్లించనున్నట్లు సంస్థ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ శ్రీధర్‌ తెలిపారు. సగటున ఒక్కో కార్మికుడికి రూ.1.15 లక్షల వరకు చెల్లించనున్నట్లు పేర్కొన్నారు. లాభాల వాటా బోనస్ రూ.79.07కోట్లు, బోనస్‌గా చెల్లింపునకు రూ.300కోట్లు సంస్థ చెల్లిస్తుందని సీఎండీ పేర్కొన్నారు. మంగళవారం సీఎం కేసీఆర్ సింగరేణి సంస్థపై సమీక్ష నిర్వహించారు.

Read More :   ప్రగ్యా గ్లామర్ ట్రీట్.. కంచె దాటేస్తుందా!

ఈ సందర్బంగా ఆర్జించన లాభాల్లో కార్మికులకు 29శాతం వాటా ఇవ్వాలని నిర్ణయించారు. గతేడాది కంటే ఈసారి ఒక శాతం వాటాను అధికంగా పెంచారు. దసరా కంటే ముందే కార్మికులకు వాటాను చెల్లించాలని సీఎండీని ఆదేశించారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం రైల్వే ఉద్యోగులకు దీపావళి బోనస్ ప్రకటించింది. 78 రోజుల వేతనాన్ని బోనస్ గా ఇవ్వనుంది.

Read More :  రెండు టైర్ల మీద ఆటో నడిపి గిన్నిస్ రికార్డ్ సృష్టించిన తంబి