Telugu News
లేటెస్ట్క్రీడలుట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలు
LIVE TV
LIVE TV
× లేటెస్ట్క్రీడలుట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలులైఫ్ స్టైల్టెక్నాలజీ
Advertisement

Telangana

Covid Vaccine : కరోనా నుంచి కోలుకున్నవారికి ఒక్క టీకా డోసు చాలు, ఏఐజీ డాక్టర్ల అధ్యయనం

కరోనా నుంచి కోలుకున్న వారికి ఒక్క టీకా డోసు చాలని ఏఐజీ వైద్యుల పరిశోధనలో వెల్లడైంది. ఒక్క డోసుతోనే వారిలో యాంటీబాడీలు వృద్ధి చెందుతాయని డాక్టర్లు చెప్పారు.

Publish Date - 8:34 am, Fri, 11 June 21

Covid Vaccine

Covid Vaccine Single Dose : కరోనా నుంచి కోలుకున్న వారికి ఒక్క టీకా డోసు చాలని ఏఐజీ వైద్యుల పరిశోధనలో వెల్లడైంది. ఒక్క డోసుతోనే వారిలో యాంటీబాడీలు వృద్ధి చెందుతాయని డాక్టర్లు చెప్పారు. కరోనా నుంచి కోలుకున్న వారిలో ఏడాది పాటు రక్షణ ఉంటుంది కాబట్టి, ఆ తర్వాత బూస్టర్ డోసు ఇవ్వచ్చన్నారు. ఈ విషయాలతో కూడిన రిపోర్టును ఐసీఎంఆర్ కు పంపామని వెల్లడించారు.

వైరస్‌ బారినపడిన నెల రోజుల తర్వాత ఒక డోసు పొందడం ద్వారా వీరిలో గణనీయంగా యాంటీబాడీలు వృద్ధి చెందినట్లుగా వైద్య నిపుణులు గుర్తించారు. ఏకంగా మూడింతలు అధికంగా ఉన్నట్టు తేల్చారు. అదే వైరస్‌ బారినపడని వ్యక్తుల్లో ఒక డోసు పొందిన తర్వాత యాంటీబాడీల వృద్ధి సాధారణంగా ఉంది. ఈ అంశంపై హైదరాబాద్‌లోని ‘ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రోఎంటరాలజీ(ఏఐజీ)’ వైద్య నిపుణులు డాక్టర్‌ డి.నాగేశ్వరరెడ్డి ఇతర డాక్టర్లు సంయుక్తంగా పరిశోధన నిర్వహించారు.

పరిశోధనలో భాగంగా కరోనా బారిన పడిన వారికి, కరోనా బారిన పడని వారికి టీకాలు ఇచ్చారు. ఒక డోసు టీకా ఇచ్చిన వారిలో 4 వారాల తర్వాత యాంటీబాడీలు ఏ మేరకు వృద్ధి చెందాయో పరిశీలించారు. కొవిడ్‌ బారినపడి కోలుకున్న వారిలో అవి గణనీయంగా వృద్ధి చెందాయి. అదే ఒక డోసు తీసుకున్న సాధారణ వ్యక్తుల్లో అంతగా వృద్ధి చెందలేదు.

ముఖ్యంగా సాధారణ వ్యక్తుల్లో కంటే కొవిడ్‌ బారినపడి కోలుకున్న వారిలో ఒక డోసు టీకాకే మూడింతలు అధికంగా వచ్చాయి. కొవిడ్‌ యాంటీబాడీలు వృద్ధి చెందాయా? లేదా అనేది తెలుసుకోవడానికి ‘న్యూట్రలైజింగ్‌ యాంటీబాడీస్‌ ఎస్‌1 ఎస్‌2’ అనే పరీక్ష చేస్తారు. ఫలితాల్లో యాంటీబాడీల వాల్యూ 150 దాటితే రక్షణగా ఉంటుందని అర్థం. కొవిడ్‌ సోకకుండా ఒక డోసు టీకా పొందిన వారిలో వాల్యూ సుమారు 150 వరకూ పెరిగింది. అదే వైరస్‌ సోకి తగ్గాక వ్యాక్సిన్‌ తీసుకుంటే 450 కంటే ఎక్కువగా ఉన్నట్లు నిపుణులు గుర్తించారు.

‘‘సాధారణంగా ఒక డోసు టీకా తీసుకుంటే ఒకట్రెండు నెలల్లో యాంటీబాడీలు తగ్గిపోతాయి. కానీ కరోనా నుంచి కోలుకున్న వారిలో ఒక డోసు తీసుకుంటే ఎక్కువ కాలం యాంటీబాడీలు కొనసాగుతున్నాయి. వీరిలో ‘టి సెల్‌’ జ్ఞాపకశక్తి దాదాపు 12 నెలల పాటు రక్షణ కల్పిస్తుందని అంచనా. ‘టి కణాల’ జ్ఞాపకశక్తి అనేది ఎముక మజ్జ (బోన్‌ మ్యారో)లో ఉండిపోతుంది. మరోసారి ఎప్పుడైతే వైరస్‌ దాడి చేస్తుందో.. అప్పుడు ఈ ‘టి సెల్స్‌’ రక్షణగా ముందుకొస్తాయి. వైరస్‌కు వ్యతిరేకంగా అవసరమైన మేరకు పెద్ద సంఖ్యలో యాంటీబాడీలను వృద్ధి చేస్తాయి’’ అని నిపుణులు వెల్లడించారు.

”కొవిడ్‌ సోకిన ఎవరైనా నెల రోజుల తర్వాత టీకా తీసుకోవచ్చు. ఇటువంటి వారికి ఒక్క డోసుతోనే యాంటీబాడీలు బాగా వృద్ధి చెందుతాయి. రెండోది అవసరం లేదు. ఇలా మిగిలిన వాటిని ఇతరులకు ఉపయోగించొచ్చు. ప్రభుత్వానికి టీకాలపై ఖర్చు కూడా తగ్గుతుంది. ఇటువంటి వారికి ఏడాది పాటు రక్షణ ఉంటుందనే అంచనాల నేపథ్యంలో.. బూస్టర్‌ డోసును ఏడాది తర్వాత ఇవ్వొచ్చు. ఈ అధ్యయన అంశాలను భారతీయ వైద్య పరిశోధన మండలికి(ఐసీఎంఆర్‌కు) కూడా పంపించాం. కొవిడ్‌ వచ్చిన వారికి ఒక డోసు టీకా సరిపోతుందనే అంశంపై కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో విధానపరమైన నిర్ణయం తీసుకోవడానికి మా పరిశోధన ఉపయోగపడుతుంది” అని ఏఐజీ చైర్మన్ డాక్టర్‌ డి.నాగేశ్వరరెడ్డి అన్నారు.

Masterminds Image CompAha Itng Aa Design Comp
Exclusive4 mins ago

టీటీడీ పాలకమండలికి రెండేళ్లు

Latest30 mins ago

Guinness records: టైపింగ్‌లో విన్యాసాలు.. తొమ్మిది గిన్నీస్ రికార్డ్‌లు అతని సొంతం!

Latest39 mins ago

Telangana Bonalu : జులై 11న ‘గోల్కొండ బోనాలు’

Exclusive48 mins ago

గులాబీ శ్రేణుల్లో జోష్.. అభివృద్ధి పనులకు శ్రీకారం

Exclusive55 mins ago

కేంద్రానికి మంత్రి కేటీఆర్ లేఖ

Exclusive57 mins ago

తెలంగాణలో రోడ్డెక్కిన ఆర్టీసీ బస్సులు

Andhrapradesh2 hours ago

Santhosh Babu : మోటివేషనల్‌ హాల్‌కు కల్నల్ సంతోష్‌ బాబు పేరు

Crime News2 hours ago

Sopore Encounter : టాప్ కమాండర్ సహా ముగ్గురు లష్కరే ఉగ్రవాదులు హతం

Latest2 hours ago

TTD Board: టీటీడీకి కొత్త ఛైర్మన్ వస్తారా?

Latest2 hours ago

Maa Elections: ‘మా’ అధ్యక్ష బరిలో ప్రకాష్ రాజ్!

Latest2 hours ago

PM Modi : కోవిడ్ వేళ ఆశాకిరణం “యోగా”

Latest2 hours ago

Vaccination New Policy: కొత్త వ్యాక్సినేషన్ పాలసీ.. నేటి నుంచి అమల్లోకి!

Latest3 hours ago

WTC final: మూడో రోజు కివీస్‌దే పైచేయి.. న్యూజిలాండ్‌ స్కోరు 101/2

Latest3 hours ago

Cow Dung : ఆవు పేడ ఎత్తుకెళ్లిన దొంగలు.. కేసు నమోదు చేసిన పోలీసులు

Latest3 hours ago

Hyderabadis: జొమోటో డెలివరీ బాయ్‌కి కస్టమర్ గిఫ్ట్.. మానవత్వం అంటే ఇదే!

Latest2 days ago

Flora Saini : ఫొటోలతో పిచ్చెక్కిస్తున్న ఫ్లోరా షైనీ..

Latest3 days ago

Kajol Devgan: ఇన్నేళ్లైనా కాజోల్‌లో కళ తగ్గలేదు..

Latest4 days ago

Malaika Arora : మతిపోగొడుతున్న మలైకా..

Latest7 days ago

Kajal Aggarwal : కాక రేపుతున్న కాజల్ అగర్వాల్..

Latest1 week ago

Tejaswi Madivada : సోకులతో సెగలు పుట్టిస్తున్న తేజస్వి..

Latest1 week ago

Hebah Patel : ఫొటోలతో హీటెక్కిస్తున్న హెబ్బా పటేల్..

Latest2 weeks ago

Sonam Kapoor : సోనమ్ కపూర్ బర్త్‌డే పిక్స్..

Latest2 weeks ago

Shilpa Shetty : శిల్పా శెట్టి బర్త్‌డే ఫొటోస్..

Latest2 weeks ago

Ananya Nagalla : అదరగొడుతున్న అనన్య నాగళ్ల..

Latest2 weeks ago

Rambha : సీనియర్ నటి రంభ బర్త్‌డే..

Latest2 weeks ago

Priya Mani Raj : ప్రియమణి బర్త్‌డే ఫొటోస్..

Latest3 weeks ago

Sreemukhi : నల్లంచు తెల్ల చీర.. శ్రీముఖి శారీ పిక్స్ వైరల్..

Latest3 weeks ago

Divi Vadthya : బ్యూటిఫుల్ పిక్స్‌తో అదరగొడుతున్న దివి..

Latest3 weeks ago

Faria Abdullah : ‘జాతి రత్నాలు’ ఫేం.. ఫరియా అబ్దుల్లా ఫొటోస్..

Latest4 weeks ago

Punarnavi Bhupalam : పిచ్చెక్కిస్తున్న పునర్నవి..

Exclusive4 mins ago

టీటీడీ పాలకమండలికి రెండేళ్లు

Exclusive48 mins ago

గులాబీ శ్రేణుల్లో జోష్.. అభివృద్ధి పనులకు శ్రీకారం

Exclusive55 mins ago

కేంద్రానికి మంత్రి కేటీఆర్ లేఖ

Exclusive57 mins ago

తెలంగాణలో రోడ్డెక్కిన ఆర్టీసీ బస్సులు

Exclusive22 hours ago

ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లో ఆంక్షలు ఎత్తివేత

Exclusive22 hours ago

నేటి నుంచి సీఎం కేసీఆర్‌ జిల్లాల పర్యటన

Exclusive22 hours ago

టీపీసీసీ కొత్త బాస్ ఎవరు..?

Exclusive22 hours ago

ఏపీ, తెలంగాణల మధ్య మరోసారి జల జగడం

Exclusive Videos2 days ago

జూలై 1 నుంచి తెలంగాణలో స్కూళ్లు ప్రారంభం

Exclusive Videos2 days ago

డైలాగ్ వార్

Exclusive Videos2 days ago

తెలంగాణలో సడలింపులు ఇవేనా..!

Exclusive Videos2 days ago

ప్రత్యేక హోదా ఇక రానట్టేనా..?

Exclusive Videos2 days ago

భారత దిగ్గజ అథ్లెట్‌ మిల్కాసింగ్ ఇక లేరు

Exclusive Videos3 days ago

ప్రత్యేక హోదాపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

Exclusive Videos3 days ago

దేశం అన్ లాక్…. మూడో ముప్పు తప్పదా..?

Masterminds Image Comp