Jagitial District : తెల్లారితే పెళ్లి.. అక్క భర్తతో ఉడాయించిన పెళ్లికూతురు.. కుటుంబ సభ్యులు ఏం చేశారంటే..

తెల్లవారు జామున పెళ్లి కూతురు జాడ కనిపించక పోవటంతో వెతుకులాట ప్రారంభించారు. కొంత సేపటి తరువాత.. అసలు విషయం తెలిసి రెండు కుటుంబాల వారు అవాక్కయ్యారు.

Jagitial District : తెల్లారితే పెళ్లి.. అక్క భర్తతో ఉడాయించిన పెళ్లికూతురు.. కుటుంబ సభ్యులు ఏం చేశారంటే..

Marriage Cancel

Jagitial District : తెల్లారితే పెళ్లి.. వివాహ వేడుకను ఘనంగా నిర్వహించేందుకు పెళ్లికూతురు కుటుంబ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం అయితే, పెళ్లి కొడుకు పెళ్లి మండపానికి చేరుకోవాల్సి ఉంది. వారి కుటుంబ సభ్యులు, బంధులుకూడా తరలివస్తారు. వారికి పెళ్లి మండపం వద్ద ఎలాంటి లోటుపాట్లు లేకుండా పెళ్లి కూతురు కుటుంబ సభ్యులు అన్ని సిద్ధం చేశారు. అప్పటికే రాత్రి కావడంతో.. త్వరగా పడుకొని తెల్లవారు జామున లేచి పనుల్లో నిమగ్నమవుదామని అనుకున్నారు. అనుకున్నట్లే తెల్లవారు జామున లేచారు. పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. ఇక పెళ్లికూతుర్ని రెడీ చేద్దామని ఆమె గదికి వెళ్లి చూడగా.. అక్కడ కనిపించలేదు. ఇంటిలో, చుట్టుపక్కల ఇళ్లలో వెతికినా పెళ్లికూతురు ఆచూకీ తెలియలేదు. కొద్దిసేపటికి.. అసలు విషయం తెలిసి అందరూ షాక్ అయ్యారు.

Army MIG-21 Crash: రాజస్థాన్‌లో ఇంటిపై కూలిన మిగ్-21 యుద్ధ విమానం.. పైలట్ సేఫ్.. ఇద్దరు మహిళలు మృతి

జగిత్యాల జిల్లా రూరల్ మండలం కన్నాపూర్ గ్రామానికి చెందిన 20యేళ్ల యువతికి మల్యాల మండలం లంబడిపల్లి గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహం నిశ్చయమైంది. ముందే నిర్ణయించుకున్న ముహూర్తం ప్రకారం.. ఆదివారం ఉదయం 11గంటలకు పెళ్లి వేడుక జరగాల్సి ఉంది. వివాహం పెళ్లికూతురు ఇంటి వద్ద చేయాలని నిర్ణయించడంతో అందుకు తగ్గట్లు ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెల్లవారితే పెళ్లి తంతు జరగాల్సి ఉంది. రెండు కుటుంబాల ఇళ్లు బంధువులతో కళకళలాడుతున్నాయి. ఆదివారం తెల్లవారు జామున పెళ్లికూతురు కనిపించటం లేదన్న సమాచారం రెండు కుటుంబాల్లో ఆందోళన కలిగించింది.

Ranbir Kapoor: బాలీవుడ్ పరిశ్రమపై రణ్‌బీర్ కపూర్ హాట్ కామెంట్స్.. అయోమయంతో ఆగం!

తెల్లవారు జామున పెళ్లి కూతురు జాడ కనిపించక పోవటంతో వెతుకులాట ప్రారంభించారు. కొంత సేపటి తరువాత.. అసలు విషయం తెలిసి రెండు కుటుంబాల వారు అవాక్కయ్యారు. పెళ్లి పీటలపై కూర్చోవాల్సిన యువతి.. తన అక్క భర్తతోనే వెళ్లిపోయినట్లు గుర్తించారు. చెల్లి వివాహానికి వస్తే తన భర్త ప్రేమ పేరుతో ఆమెను తీసుకెళ్లడంతో అతని భార్య కన్నీరుమున్నీరైంది. ఇన్నాళ్లు తన చెల్లి, భర్త మధ్య ఇంత వ్యవహారం నడుస్తున్నా..  గుర్తించలేక పోయానని వాపోయింది. పెళ్లికూతురు చేసిన పనికి పెళ్లి క్యాన్సిల్ కావడంతో రెండు కుటుంబాల్లోనూ విషాదం నెలకొంది.