SIT Notice : టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ పై ఆరోపణలు చేసిన రేవంత్ రెడ్డికి సిట్ నోటీసులు

టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో సిట్ దూకుడు పెంచింది. పేపర్ లీక్ అంటూ ఆరోపణలు చేస్తున్నవారికి నోటీసులు ఇస్తోన్నారు. ఇందులో భాగంగా గ్రూప్-1 ప్రశ్నాపత్రం లీక్ పై ఆరోపణలు చేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి సిట్ అధికారులు ఇచ్చారు.

SIT Notice : టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ పై ఆరోపణలు చేసిన రేవంత్ రెడ్డికి సిట్ నోటీసులు

SIT notices

SIT Notice : టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసు(TSPSC Paper Leak)లో సిట్ దూకుడు పెంచింది. పేపర్ లీక్ అంటూ ఆరోపణలు చేస్తున్నవారికి నోటీసులు ఇస్తోన్నారు. ఇందులో భాగంగా గ్రూప్-1 ప్రశ్నాపత్రం లీక్ పై ఆరోపణలు చేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy)కి  సిట్ అధికారులు ఇచ్చారు. పేపర్ లీక్ కేసుకు సంబంధించి తన దగ్గరున్న ఆధారాలు ఇవ్వాలంటూ రేవంత్ కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు.

ఒకే మండలంలో 100 మందికి ర్యాంకులు వచ్చాయని రేవంత్ పేర్కొన్నారు. గ్రూప్-1లో కేటీఆర్ పీఏ స్వంత మండలంలో వంద మందికి వందకు పైగా మార్కులు వచ్చాయని రేవంత్ ఆరోపణలు చేశారు. పేపర్ లీక్ పై రేవంత్ చేసిన ఆరోపణలకు గానూ ఆయనకు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. అయితే రేవంత్ రెడ్డి కార్యాలయ అధికారులు మాత్రం సిట్ నుంచి ఎలాంటి నోటీసులు రాలేదని అంటున్నారు.

TSPSC Paper Leak : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో సంచలన విషయాలు.. అక్టోబర్ నుంచే ప్రవీణ్, రాజశేఖర్ ఆధీనంలో TSPSC కంప్యూటర్ వ్యవస్థ

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం సంచలనంగా మారింది. పేపర్ లీకేజీలో ఇద్దరు వ్యక్తులకే ప్రమేయం ఉందని ఎలా చెబుతారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కేటీఆర్ ఏమైనా ప్రత్యేక విచారణ అధికారా అని పేర్కొన్నారు. చంచల్ గూడ జైలు సందర్శకుల వివరాలు బయటపెట్టాలన్నారు. మార్చి 13-18 మధ్య ఎవరెవరు జైలును సందర్శించారో వెల్లడించాలని డిమాండ్ చేశారు.

పేపర్ లీక్ తో తనకు సంబంధం లేదని కేటీఆర్ వితండవాదం చేస్తున్నారని పేర్కొన్నారు. చంచల్ గూడ జైలు సీసీ టీవీ ఫుటేజ్ బయటపెట్టాలన్నారు. 20 మంది అక్రమంగా పరీక్ష రాశారని పేర్కొన్నారు. 2015 నుంచి పేపర్ లీకేజీ జరుగుతోందన్నారు. కేసు విచారణ సక్రమంగా జరగడం లేదని చెప్పారు.
కేటీఆర్ ఆఫీస్ నుంచి మొత్తం వ్యవహారం జరిగిందని ఆరోపించారు.

Revanth Reddy : కేసీఆర్, కేటీఆర్ ప్రమేయం లేకుండా ఏ స్కామ్ కూడా జరగలేదు, ఆంధ్రా వ్యక్తికి ఉద్యోగం ఎలా ఇచ్చారు?-రేవంత్ రెడ్డి

గ్రూప్-1లో వంద మార్కులకుపైగా వచ్చిన వారందరి వివరాలను ప్రభుత్వం బయట పెట్టాలని డిమాండ్ చేశారు. పెద్దల పేర్లు చెబితే నిందితులను ఎన్ కౌంటర్ చేస్తామని బెదిరించారని పేర్కొన్నారు. టీఎస్పీఎస్సీలో పని చేస్తూ పోటీ పరీక్షలకు ఎలా ప్రిపేర్ అవుతారని ప్రశ్నించారు. కేటీఆర్ ఏపీ తిరుపతి..ఏ-2 రాజశేఖర్ ఇద్దరిది పక్క పక్క గ్రామాలన్నారు. తిరుపతి వల్లే రాజశేఖర్ కు ఉద్యోగం వచ్చిందని తెలిపారు. కేటీఆర్ ఆఫీస్ నుంచే ఇదంతా జరిగిందని చెప్పారు.