MLC Elections : ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు నేడే పోలింగ్

తెలంగాణలో శాసన మండలి స్థానిక సంస్థల ఎన్నికల కోలాహలం నెలకొంది. స్థానిక సంస్థల కోటాలో ఖాళీగా ఉన్న 6 స్థానాలకు శుక్రవారం ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమై.. సాయంత్రం 4 గంలకు ముగుస్తుంది

MLC Elections : ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు నేడే పోలింగ్

Mlc Elections

MLC Elections : తెలంగాణలో శాసన మండలి స్థానిక సంస్థల ఎన్నికల కోలాహలం నెలకొంది. స్థానిక సంస్థల కోటాలో ఖాళీగా ఉన్న 6 స్థానాలకు శుక్రవారం ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమై.. సాయంత్రం 4 గంలకు ముగుస్తుంది. ఈ ఆరు స్థానాల్లో మొత్తం 26 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో 2,329 మంది పురుష ఓటర్లు, 2,997 మంది మహిళ ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

చదవండి :

ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, మున్సిపల్‌ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఓటు హక్కును కలిగి ఉండగా, తొలిసారిగా.. ఎన్నికలు జరిగే ఉమ్మడి జిల్లాల పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎంపీలకు కూడా ఓటు హక్కు కల్పించారు. ఈ ఎన్నికల్లో ఎంపీటీసీలు మున్సిపల్ కౌన్సిలర్ల ఓట్లే మూడొంతులు ఉండగా.. వీరే అభ్యర్థుల విజయాన్ని ఖరారు చేయనున్నారు.

చదవండి :

ఆదిలాబాద్, మెదక్, నల్లగొండ, ఖమ్మంలో ఒక్కో స్థానానికి, కరీంనగర్‌లో రెండు స్థానాలకు జరగనున్న ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఆరు స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలో ఉంచింది. ఇక ఖమ్మం, నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను బరిలో ఉంచగా.. మిగతా చోట్ల స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నారు.