కరోనాకు బలైన తండ్రి డెడ్ బాడీ కోసం, వెయిట్ చేస్తున్న వ్య‌క్తి సెల్ ఫోన్ చోరీ

  • Published By: madhu ,Published On : June 17, 2020 / 03:44 AM IST
కరోనాకు బలైన తండ్రి డెడ్ బాడీ కోసం, వెయిట్ చేస్తున్న వ్య‌క్తి సెల్ ఫోన్ చోరీ

చోరుల‌కు మాన‌వ‌త్వం లేకుండా పోతోంది. క‌రోనా వేళ..తీవ్ర విషాదంలో ఉన్న ఓ వ్య‌క్తి ద‌గ్గ‌రి నుంచి సెల్ ఫోన్ చోరీ చేశారు. ఈ ఘ‌ట‌న దేశ రాజ‌ధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. ఢిల్లీ జీటీబీ ఆసుప‌త్రిలో 44 సంవ‌త్స‌రాల వ‌య‌స్సున్న వ్య‌క్తి క‌రోనా కార‌ణంగా చ‌నిపోయాడు. దీంతో తండ్రి మృత‌దేహాన్ని తీసుకొనేందుకు…2020, జూన్ 15వ తేదీ సోమ‌వారం ఆసుప‌త్రికి వ‌చ్చిన పంక‌జ్ కుమార్ వ‌ద్ద‌నున్న సెల్ ఫోన్ చోరీ చేశారు..

మృత‌దేహాన్నికి సంబంధించిన ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని..త‌న కుటుంబ‌స‌భ్యుల కోసం మాదీపూర్ నివాసి పంక‌జ్ కుమార్ క్యాబ్ ఏర్పాటు చేశాడు. గేటు నెంబ‌ర్ 6 బ‌య‌ట వేచి ఉన్నాన‌ని, త‌న స్నేహితుడితో మాట్లాడుతుండ‌గా…కానీ..అదే స‌మ‌యంలో బైక్ పై వ‌చ్చిన వ్య‌క్తులు త‌న సెల్ ఫోన్ లాక్కొళ్లి పోయార‌ని వాపోయాడు.

అందులో త‌న స్నేహితుల ఫోన్ నెంబ‌ర్లు, త‌న తండ్రి ఆధార్ కార్డు, ఫొటోలు ఉన్నాయ‌ని, మృత‌దేహాన్ని అప్ప‌గించే స‌మ‌యంలో త‌న‌కు ఉప‌యోగ‌ప‌డేవ‌ని..అది సాధ్యం కాలేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. స‌మీపంలో ఉన్న ఓ టీ అమ్మే వ్య‌క్తి..త‌న‌కు స‌హాయం చేసేందుకు ముందుకొచ్చాడ‌ని, అత‌ని ఫోన్ ద్వారా పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చాన‌న్నారు. చివ‌ర‌కు అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసి..తండ్రి అంత్య‌క్రియ‌లు పూర్తి చేశాడు పంక‌జ్‌. 

కేసు న‌మోదు  చేశామ‌ని, అనుమానితుల‌ను గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజ్ ల‌ను స్కానింగ్ చేస్తున్నామ‌ని డిప్యూటి క‌మిష‌న‌ర్ ఆఫ్ పోలీస్ అమిత్ శ‌ర్మ వెల్ల‌డించారు. త‌న తండ్రి ర‌మేష్ కుమార్ ప‌ది రోజుల క్రితం అస్వ‌స్థ‌త‌కు గురైన‌ట్లు, బ‌ల‌హీనంగా ఉండ‌డం..ఆహారం తీసుకోక‌పోతుండ‌డంతో స్థానిక ఆసుప‌త్రికి తీసుకెళ్లాన‌ని పంక‌జ్ వెల్ల‌డించారు. జీటీబీ ఆసుప‌త్రికి తీసుకెళ్ల‌గా..క‌రోనా సోకింద‌ని గుర్తించార‌న్నారు. తాను ఆఫ్టిక‌ల్ షోరూంలో ప‌నిచేస్తున్నాన‌ని చెప్పుకొచ్చాడు. 

Read: మంచుకొండ‌ల్లో ర‌క్తం : భార‌త్ – చైనా వివాదం ఏంటీ