Heart Attack : క్రికెట్ ఆడుతూ గుండె పోటుతో సాఫ్ట్ వేర్ ఉద్యోగి మృతి

హైదరాబాద్ కూకట్ పల్లిలోని ఓ హాస్టల్ లో ఉంటూ మణికంఠ సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వీకెండ్ లో స్నేహితులతో కలిసి రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని కేసీఆర్ స్టేడియంలో మణికంఠ క్రికెట్ ఆడారు.

Heart Attack : క్రికెట్ ఆడుతూ గుండె పోటుతో సాఫ్ట్ వేర్ ఉద్యోగి మృతి

Heart Attack

Heart Attack : తెలంగాణలో గుండెపోటు మరణాలు ఎక్కువ అవుతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా గుండెపోటుకు గురవుతున్నారు. పిల్లలు మొదలుకొని పెద్దల వరకు గుండె పోటుతో మరణిస్తున్నారు. ఇటీవలి కాలంలో గుండెపోటుకు గురై మరణిస్తున్న యువకుల సంఖ్య అధికమైంది. తాజాగా మరొకరు గుండె పోటుతో మృతి చెందారు.

క్రికెట్ ఆడుతూ గుండె పోటుకు గురై ప్రాణాలు కోల్పోయారు. రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరంలో విషాదం నెలకొంది. క్రికెట్ ఆడుతుండగా గుండె పోటు రావడంతో సాఫ్ట్ వేర్ ఉద్యోగి మణికంఠ మృతి చెందారు. ఈ విషాదకరమైన ఘటన మహేశ్వరంలోని కేసీఆర్ స్టేడియంలో చోటు చేసుకుంది. మణికంఠ అనే వ్యక్తి సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నారు.

Cardiac Arrest : క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో 14ఏళ్ల బాలుడు మృతి

హైదరాబాద్ కూకట్ పల్లిలోని ఓ హాస్టల్ లో ఉంటూ మణికంఠ సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వీకెండ్ లో స్నేహితులతో కలిసి రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని కేసీఆర్ స్టేడియంలో మణికంఠ క్రికెట్ ఆడారు.

ఒకే ఓవర్ బాలింగ్ చేసి కార్ లోకి వెళ్లి మణికంఠ విశ్రాంతి తీసుకున్నారు. మణికంఠ గుండె పోటుతో కారులోనే తుది శ్వాస విడిచారు. మణికంఠ సోదరుడి ఫిర్యాదు మేరకు మహేశ్వరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.