Omicron Telangana : తెలంగాణలో ఒమిక్రాన్, ఫేక్ మెసేజ్ పట్ల అప్రమత్తంగా ఉండాలి

ఒమిక్రాన్ వేరియంట్ ఉందో లేదో తెలుసుకోవాడానికి జెనెటిక్ అనాలిసిస్ చేయాల్సి ఉంటుందని, ఇందుకు రెండు వారాల దాక సమయం పట్టొచ్చన్నారు.

Omicron Telangana : తెలంగాణలో ఒమిక్రాన్, ఫేక్ మెసేజ్ పట్ల అప్రమత్తంగా ఉండాలి

Fake Message

Fake Messages Omicron : తెలంగాణ రాష్ట్రంలో ఒమిక్రాన్ ఎంట్రీ ఇచ్చిందా ? ఎయిర్ పోర్టులో దిగిన ఓ ప్రయాణీకుడికి కొత్త వేరియంట్ సోకిందని సోషల్ మీడియాలో తెగ ప్రచార జరుగుతోంది. దీంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. 2021, డిసెంబర్ 02వ తేదీ గురువారం రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు ఒమిక్రాన్ విషయంలో మీడియాతో మాట్లాడారు. యూకే, సింగ‌పూర్ నుంచి వ‌చ్చిన ప్ర‌యాణికుల‌కు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఆర్టీపీసీఆర్ (RTPCR) ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా, ఒక మ‌హిళ‌కు క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింద‌ని వెల్ల‌డించారు.

Read More : Telangana : వరికి ప్రత్యామ్నాయంగా ఈ పంటలు వేసుకోవాలి

అయితే…ఇది ఒమిక్రాన్ వేరియంటా ? కాదా ? అనేది ఒకటి రెండు రోజుల్లో తేలుతుందని ఆయన తెలిపారు. అయితే…దీనిపై రకరకాల వార్తలు వైరల్ అయ్యాయి. దీనిపై తెలంగాణ డిజిటల్ మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్ స్పందించారు. ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. కోవిడ్ రోగిలో ఒమిక్రాన్ వేరియంట్ ఉందో లేదో తెలుసుకోవాడానికి జెనెటిక్ అనాలిసిస్ చేయాల్సి ఉంటుందని, ఇందుకు రెండు వారాల దాక సమయం పట్టొచ్చన్నారు. ఎయిర్ పోర్టులో దిగిన ప్రయాణీకుడికి ఒమిక్రాన్ వేరియంట్ నిర్ధారణ అయ్యిందంటూ ఫేక్ మెసేజ్ ల పట్ల అప్రమత్తంగా ఉండాలని కొణతం దిలీప్ ట్వీట్ లో వెల్లడించారు.

Read More : Cyclone Jawad : విజయనగరంలో రెండు రోజులు పాఠశాలలకు సెలవు, విశాఖకు పర్యాటకులు రావొద్దు

భారతదేశంలో ఒమిక్రాన్ వేరియంట్ ఏ క్షణంలోనైనా వచ్చే అవకాశం ఉందని, ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని తెలిపారు. కాసేపటికే భారత్ లో కి ఒమిక్రాన్ ఎంట్రీ ఇచ్చిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కర్నాటకలో రెండు కేసులు వెలుగు చూశాయని తెలిపింది. ఓ మహిళకు గచ్చిబౌలి టిమ్స్ కు తరలించి…పరీక్షలు నిర్వహించడం జరిగిందని శ్రీనివాస్ తెలిపారు. అది ఒమిక్రాన్ వేరియంటా ? కాదా ? అనేది తెలియాలంటే..కొన్ని రోజులు పడుతుందన్నారు.