Somesh Kumar: తెలంగాణ నుంచి సోమేష్ కుమార్ రిలీవ్.. ఆదేశాలు జారీ చేసిన కేంద్రం.. నూతన సీఎస్‌గా రామకృష్ణారావు?

కోర్టు తీర్పును అనుసరిస్తూ, సోమేష్ కుమార్‌ను తెలంగాణ నుంచి రిలీవ్ చేసింది కేంద్రం. రాష్ట్ర విభజన సమయంలో సోమేష్ కుమార్‌ను కేంద్ర ప్రభుత్వం ఏపీకి కేటాయించింది. అయితే, ఆయన తెలంగాణలోనే కొనసాగేలా గతంలో క్యాబ్ ఆదేశాలు జారీ చేసింది.

Somesh Kumar: తెలంగాణ నుంచి సోమేష్ కుమార్ రిలీవ్.. ఆదేశాలు జారీ చేసిన కేంద్రం.. నూతన సీఎస్‌గా రామకృష్ణారావు?

Somesh Kumar: తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సోమేష్ కుమార్‌ను రిలీవ్ చేస్తూ కేంద్రం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఎల్లుండిలోపు ఏపీలో ప్రభుత్వానికి రిపోర్టు చేయాలని డీవోపీటీ ఆదేశించింది. తెలంగాణ చీఫ్ సెక్రటరీగా సోమేష్ కుమార్ నియామకాన్ని తెలంగాణ హైకోర్టు రద్దు చేసిన సంగతి తెలిసిందే.

IPL 2023: ఈ ఏడాది 11 భాషల్లో స్ట్రీమ్ కానున్న ఐపీఎల్.. ఏ ఓటీటీ యాప్‌లోనో తెలుసా?

ఈ నేపథ్యంలో కోర్టు తీర్పును అనుసరిస్తూ, సోమేష్ కుమార్‌ను తెలంగాణ నుంచి రిలీవ్ చేసింది కేంద్రం. రాష్ట్ర విభజన సమయంలో సోమేష్ కుమార్‌ను కేంద్ర ప్రభుత్వం ఏపీకి కేటాయించింది. అయితే, ఆయన తెలంగాణలోనే కొనసాగేలా గతంలో క్యాబ్ ఆదేశాలు జారీ చేసింది. కేంద్రం ఇచ్చిన ఉత్తర్వుల్ని రద్దు చేసింది. దీంతో ఆయన తెలంగాణలోనే కొనసాగుతున్నారు. అయితే, క్యాట్ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ 2017లో కేంద్రం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. అప్పటినుంచి దీనిపై విచారణ జరిపిన కోర్టు తాజాగా తెలంగాణలో ఆయన నియామకం చెల్లదని ఆదేశించింది. సీఎస్‌గా కొనసాగకూడదని తీర్పునిచ్చింది.

Virat Kohli: సచిన్ రికార్డు సమం చేసిన కోహ్లీ.. స్వదేశంలో 20వ సెంచరీ నమోదు

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ఈ తీర్పు వెలువరించారు. ఇక సోమేష్ కుమార్ ఏపీ వెళ్లడం ఖాయం కావడంతో కొత్త వ్యక్తిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. దీనికోసం పలువురి పేర్లను పరిశీలిస్తోంది. రామకృష్ణా రావు, అరవింద్ కుమార్, రజత్ కుమార్ పేర్లను ప్రభుత్వం పరిశీలిస్తోంది. అయితే, వీరిలో రామకృష్ణా రావు వైపే ప్రభుత్వం మొగ్గుచూపుతున్నట్లుగా తెలుస్తోంది. ఆయన ప్రస్తుతం ఫైనాన్స్ సెక్రటరీగా పని చేస్తున్నారు.