Adilabad : రైతు బిడ్డే కాడెద్దు..చలించిన ఎమ్మెల్యే రేఖా నాయక్

ఆ రైతుకు తన బిడ్డే కాడెద్దుగా మారాడు. తండ్రి అరకు పట్టి..చేను దున్నుతుంటే..ఓ వైపు కాడెద్దుగా మారి కొడుకు సేవ చేస్తున్నాడు. సాగులో సహకరిస్తూ...తండ్రికి వెన్నుదన్నుగా నిలుస్తున్నాడు.

Adilabad : రైతు బిడ్డే కాడెద్దు..చలించిన ఎమ్మెల్యే రేఖా నాయక్

Adb

Son Replace Bull : ఆ రైతుకు తన బిడ్డే కాడెద్దుగా మారాడు. తండ్రి అరకు పట్టి..చేను దున్నుతుంటే..ఓ వైపు కాడెద్దుగా మారి కొడుకు సేవ చేస్తున్నాడు. సాగులో సహకరిస్తూ…తండ్రికి వెన్నుదన్నుగా నిలుస్తున్నాడు. నేలతల్లిని నమ్ముకుని సేద్యం చేసే అన్నదాతకు ఎన్ని అవాంతరాలు ఎదురైనా..కాడిని వదలరని ఈ దృశ్యమే నిదర్శనం.

ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం డొంగర్ గ్రామంలో ఓ రైతు నివాసం ఉంటున్నాడు. తొలకరి పలకరించడం..వర్షాలు పడడంతో పొలం పండించేందుకు సిద్ధమయ్యాడు. ఇతనికి ఆరు ఎకరాల పొలం ఉంది. అయితే..అతనికున్న రెండు కాడెద్దుల్లో ఒక ఎద్దు అకస్మాత్తుగా చనిపోయింది.

దీంతో ఆ రైతు తీవ్ర ఆందోళన చెందాడు. మరో ఎద్దు కొనాలంటే..ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. ఏమి చేయాలో పాలుపాలేదు. పత్తి విత్తనాలు వేయకపోతే..వెనుకబడి పోతానని గ్రహించాడు. కొడుకు సాయినాథ్ తండ్రి ఆందోళనను గ్రహించాడు. తాను కాడిని దున్నుతానని చెప్పాడు. అయితే..చదువుకోవాల్సిన సమయంలో..ఇలాంటివి ఎందుకని తండ్రి గ్రహించాడు. కానీ..చివరకు కొడుకు చేసిన ప్రతిపాదనకు ఒకే చెప్పాడు. ఒక వైపు ఎద్దు ..మరోవైపు..కొడుకుతో పొలం దున్నాడు.

ఈ విషయం ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ కు తెలిసింది. ఆ రైతుకు అండగా నిలవాలని నిర్ణయం తీసుకున్నారు. అనారోగ్యంతో హైదరాబాద్ లో ఉన్న రేఖా నాయక్…రూ. 20 వేల రూపాయలు టీఆర్ఎస్ నేతలకు పంపించారు. ఆ రైతును కలిసిన నేతలు..రూ. 20 వేల నగదును అందించారు.