Ukraine Crisis : లాక్‌‌డౌన్ సమయంలో కొడుకును రక్షించుకుంది.. మళ్లీ కన్నపేగు అల్లాడుతోంది

లాక్ డౌన్ సమయంలో కొడుకును రక్షించడానికి ఆ తల్లి పెద్ద సాహసమే చేసింది. ఏకంగా బోధన్ నుంచి నెల్లూరుకు వరకు ద్విచక్ర వాహనంపై ప్రయాణించి వార్తల్లోకి ఎక్కింది. మళ్లీ ఇప్పుడా ఆ తల్లికి...

Ukraine Crisis : లాక్‌‌డౌన్ సమయంలో కొడుకును రక్షించుకుంది.. మళ్లీ కన్నపేగు అల్లాడుతోంది

Mother

Woman Rode 1400 KM: లాక్ డౌన్ సమయంలో కొడుకును రక్షించడానికి ఆ తల్లి పెద్ద సాహసమే చేసింది. ఏకంగా బోధన్ నుంచి నెల్లూరుకు వరకు ద్విచక్ర వాహనంపై ప్రయాణించి వార్తల్లోకి ఎక్కింది. మళ్లీ ఇప్పుడా ఆ తల్లికి ఆపదొచ్చింది. ఉక్రెయిన్ లో ఇరుక్కపోయిన తన కొడుక్కిని రక్షించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతోంది. ఉక్రెయిన్ లో నెలకొన్న పరిస్థితులను తలచుకుని బాధ పడుతోంది. రష్యా చేపడుతున్న దాడుల క్రమంలో.. ఎలాంటి పరిస్థితి నెలకొంటుందోనని ఆ తల్లి మథనపడుతోంది. వైద్య విద్య కోసం ఉక్రెయిన్ వెళ్లిన కొడుక్కు కోసం కన్నపేగు అల్లాడుతోంది.

Read More : Nuclear Power Plant : రష్యా దాడుల్లో యూరప్ అతిపెద్ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం.. యుక్రెయిన్ హెచ్చరిక!

Mother Bodhan

Mother Bodhan 1400 km

నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సాలంపాడ్ లో రజియాబేగం నివాసం ఉంటోంది. సాలంపాడ్ క్యాంపు విలేజ్ లో ఈమె ప్రభుత్వ ఉపాధ్యయురాలిగా పని చేస్తోంది. 14 ఏళ్ల క్రితం భర్తను కోల్పోయిన రజియా బేగంకు నిజాముద్దీన్ అమన్ అనే కొడుకు ఉన్నాడు. మూత్రపిండాల వ్యాధితో చనిపోయిన భర్తను కోల్పోయిన ఈమె రోగులకు సేవ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కొడుకు వైద్య వృత్తి వైపు మొగ్గు చూపాడు. ఈశన్యా ఉక్రెయిన్ లోని సుమీ నగరంలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ప్రస్తుతం రష్యా చేపడుతున్న దాడులతో ఎంతో మంది భారతీయులు ఇరుక్కున్న సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలతో వారిని ఇండియాకు రప్పిస్తున్నారు. అయితే.. నిజాముద్దీన్ ఇంకా అక్కడనే ఉన్నాడని, వెంటనే అతడిని ఇక్కడకు రప్పించే విధంగా చర్యలు చేపట్టాలని కేంద్ర, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలను రజియాబేగం కోరుతున్నారు.

Read More : గ్రెనేడ్లతో జనాలను బెదిరిస్తున్న రష్యా సైనికులు

ఇక రజియా బేగం విషయానికి వస్తే.. 2020 సంవత్సరం మార్చిలో కరోనా ఉధృతంగా వ్యాపించిన సంగతి తెలిసిందే. దీంతో అకస్మాత్తుగా లాక్ డౌన్ విధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సమయంలో రజియా బేగం కొడుకు నెల్లూరులో చిక్కుకపోయాడు. వెంటనే తన కొడుక్కిని తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. ద్విచక్ర వాహనంపై వెళ్లేందుకు తనకు అనుమతి ఇవ్వాలని బోధన్ ఎస్పీకి వినతిపత్రం ఇచ్చినట్లు ఆమె వెల్లడించింది. మానవతా హృదయంతో స్పందించిన ఎస్పీ.. అనుమతి ఇచ్చారు. దాదాపు 1400 కిలోమీటర్లు పాటు ప్రయాణించిన ఆమెకు పలు ప్రాంతాల్లో పోలీసులు ఆపారు. కానీ అనుమతి పత్రం ఉండడంతో ఆమె సేఫ్ గా నెల్లూరుకు చేరుకుని కొడుక్కుని క్షేమంగా గ్రామానికి తీసుకొచ్చింది. ఈమెకు సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. మళ్లీ ఇప్పుడు కొడుక్కి కోసం కన్నపేగు అల్లాడుతోంది.