Jaggareddy : విద్యార్థులు ప్రాణాలు కోల్పోవద్దని సోనియా తెలంగాణ ఇచ్చారు : జగ్గారెడ్డి

ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థుల త్యాగం మరవలేమని అన్నారు. రాహుల్ గాంధీని ఉస్మానియా యూనివర్సిటీకి తీసుకువస్తామని చెప్పారు. రాజకీయాలకు సంబంధం లేకుండా యూనివర్సిటీకి వెళ్తారని పేర్కొన్నారు.

Jaggareddy : విద్యార్థులు ప్రాణాలు కోల్పోవద్దని సోనియా తెలంగాణ ఇచ్చారు : జగ్గారెడ్డి

Jaggareddy

mla Jaggareddy : ఉద్యోగాల కోసం తెలంగాణ ఉద్యమం జరిగిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. విభజనలో ప్రధాన పాత్ర పోషించిన చరిత్ర ఉస్మానియా యూనివర్సిటీదని కొనియాడారు. విద్యార్థులు ప్రాణాలు కోల్పోవద్దని సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని గుర్తు చేశారు. ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థుల త్యాగం మరవలేమని అన్నారు.

రాహుల్ గాంధీని ఉస్మానియా యూనివర్సిటీకి తీసుకువస్తామని చెప్పారు. రాజకీయాలకు సంబంధం లేకుండా యూనివర్సిటీకి వెళ్తారని పేర్కొన్నారు. రాహుల్.. యూనివర్సిటీ సందర్శించి, విద్యార్థులతో మాట్లాడతారని తెలిపారు.

Khammam Puvvada : ఖమ్మంలో పువ్వాడ తిరగకుండా అడ్డుకుంటాం జగ్గారెడ్డి హెచ్చరికలు

యూనివర్సిటీ సమస్యలు..ఉద్యోగాల భర్తీ మీద మాట్లాడతారని వెల్లడించారు. సమస్యలు రాహుల్ గాంధీ దృష్టికి తీసుకువచ్చే అవకాశం ఉందన్నారు. రాజకీయాలకు సంబంధం లేకుండా రాహుల్ గాంధీ సమావేశం జరుగుతుందని పేర్కొన్నారు.