Adulterated Cake Mafia : కేక్ లవర్స్ బీకేర్ ఫుల్.. ఇవి తింటే ప్రాణాలకే ప్రమాదం..! పోలీసుల దాడుల్లో షాకింగ్ విషయాలు

Adulterated Cake Mafia : కాసుల కక్కుర్తితో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. హానికారక కెమికల్స్ తో కేకులు తయారు చేసి మార్కెట్ లో విక్రయిస్తున్నారు.

Adulterated Cake Mafia : కేక్ లవర్స్ బీకేర్ ఫుల్.. ఇవి తింటే ప్రాణాలకే ప్రమాదం..! పోలీసుల దాడుల్లో షాకింగ్ విషయాలు

Cake

Adulterated Cake Mafia – Hyderabad : చిన్న, పెద్ద అనే తేడా లేదు. కేక్ అంటే అందరికీ ఇష్టమే. ఏదైనా సెలబ్రేషన్ వచ్చిందంటే కచ్చితంగా కేక్ కట్ చేయాల్సింది. దాన్ని టేస్ట్ చేయాల్సిందే. మరీ ముఖ్యంగా బర్త్ డే సెల్రబేషన్స్ అంటే.. కేక్ ఉండి తీరాల్సిందే. బర్త్ డే పార్టీలో కేక్ కట్ చేసి దాన్ని గెస్టులకు పంచడం కామన్. ఇక, కొంతమందికి రోజూ కేక్ లాగించడం ఓ అలవాటు. చాలామంది లొట్టలేసుకుంటూ మరీ తింటారు.

ఈ కేక్ తింటే.. పైకి పోవాల్సిందే..!
అయితే కేక్ ప్రియులు జాగ్రత్త పడాల్సిన సమయం వచ్చింది. చాలా కేర్ ఫుల్ గా ఉండాలి. లేదంటే అనారోగ్యం బారిన పడటం ఖాయం. మీ ప్రాణాలకే ప్రమాదం ఏర్పడొచ్చు. ఎందుకంటే.. కొందరు కేటుగాళ్లు నకిలీ కేక్ లు తయారు చేస్తున్నారు. కాసుల కక్కుర్తితో ప్రజల ప్రాణాలతో చెలగాటం
ఆడుతున్నారు. హానికారక కెమికల్స్ తో కేకులు తయారు చేసి మార్కెట్ లో విక్రయిస్తున్నారు. ఈ కేక్ లు కానీ తిన్నారంటే మంచాన పడి పైకి పోవాల్సిందే అంటున్నారు డాక్టర్లు.(Adulterated Cake Mafia)

Rajasthan : చాక్లెట్ల ఆశ చూపి ఇంటికి తీసుకెళ్లి పిల్లలపై హెడ్‌మాస్టర్ అఘాయిత్యం, ఆ వీడియోలకు బానిసగా మారి ఇలా..

హానికారక కెమికల్స్ తో కేక్స్ తయారీ:
బాలానగర్ ఎస్వోటీ పోలీసుల దాడుల్లో షాకింగ్ విషయాలు తెలిశాయి. హైదరాబాద్ నిజాంపేట్ ప్రాంతంలోని బాలాజీ కేక్ ఫ్యాక్టరీపై దాడి చేసిన ఎస్వోటీ పోలీసులు హానికారక కెమికల్స్ తో కేక్ లు తయారు చేస్తున్నట్లుగా గుర్తించారు. ఎటువంటి నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా అపరిశుభ్రత
వాతావరణంలో కేక్ లు తయారు చేస్తున్నట్లు తెలుసుకున్నారు. కేక్ మాస్టర్ సయ్యద్ వాసిఫ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు, ఫ్యాక్టరీ యజమాని గోపాల కృష్ణ పరారీలో ఉన్నాడు. అతడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.

ప్రజల ప్రాణాలతో చెలగాటం:
చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్, పాలు.. ఇప్పుడు కేక్ లు.. కాదేదీ కల్తీకి అనర్హం అన్నట్లుగా పరిస్థితి తయారైంది. కొందరు నీచులు కాసుల కోసం దిగజారిపోతున్నారు. కల్తీ, నకిలీ ఆహార పదార్ధాలు తయారు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. నాణ్యతా ప్రమాణాలు అస్సలు పాటించరు. అపరిశుభ్ర వాతావరణం. పైగా హానికారక కెమికల్స్ వినియోగం.. ఇదీ కొందరు అక్రమార్కుల తీరు. ఇలా తయారు చేసిన కేక్ లను గుట్టు చప్పుడు కాకుండా అమ్మేస్తున్నారు. ఈ విషయాలేవీ తెలియని ప్రజలు వాటిని కొని, తిని మంచాన పడుతున్నారు. తమ ప్రాణాలను ప్రమాదంలోకి పడేసుకుంటున్నారు.

కేక్ తయారీ గోదాములో భయానక పరిస్థితులు:
బాలాజీ కేక్ ఫ్యాక్టరీలో ఎలాంటి పరిస్థితుల్లో కేక్ లు తయారు చేస్తున్నారో చూసి కళ్లారా చూసిన పోలీసులే షాక్ తిన్నారు. హానికారక రసాయన పదార్ధాలు, కలుషితమైనవి, అపరిశుభ్ర వాతావరణం.. ఇలాంటి పరిస్థితుల్లో కేక్ లు తయారు చేస్తున్నారు. ఇలా తయారు చేసిన కేక్ లను పిల్లలు, పెద్దలు తింటున్నారు. కేక్ లను భద్రపరిచే ఫ్రిడ్జిని చూసి పోలీసులు నివ్వెరపోయారు.
ఆ ఫ్రిడ్జి ఎంతో దారుణంగా ఉంది. చాలా అపరిశుభ్రంగా ఉంది.(Adulterated Cake Mafia)

ఎంతో దారుణమైన పరిస్థితుల్లో తయారు చేసిన కేక్ లను తాము తింటున్నట్లు పిల్లలకు, పెద్దలకు తెలియడం లేదు. ఫ్రిడ్జి నుంచి కుళ్లిన వాసన వస్తోంది. నాసిరకం పదార్దాలతో కేక్స్ తయారు చేస్తున్నారు. నగర శివారుల్లో ఇలా కల్తీ ఆహార పదార్ధాలు చేసే గోదాములు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. వీటిని ఎలా తయారు చేస్తున్నారు? అనేది ఎవరూ చూడటం లేదు. కస్టమర్లను అట్రాక్ట్ చేసేందుకు పలు రంగుల్లో ఈ కేక్స్ తయారు చేస్తున్నారు. ఆ రంగులు చూసి కస్టమర్లు మోసపోతున్నారు.

Also Read..Mumbai College girl : ముంబయి కాలేజీ హాస్టల్లో దారుణం