Special Trains : తెలుగు ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. సమ్మర్ స్పెషల్, 104 ప్రత్యేక రైళ్లు

ప్రయాణీకులను సౌకర్యవంతంగా ఉండేందుకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయాలని భావించింది. అందులో భాగంగా ప్రయాణీకుల రద్దీ దృష్టిలో పెట్టుకుని వారి సౌకర్యార్థం...

Special Trains : తెలుగు ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. సమ్మర్ స్పెషల్, 104 ప్రత్యేక రైళ్లు

Trains

South Central Railway : వేసవి కాలం వచ్చేసింది. దీంతో స్కూళ్లు, విశ్వ విద్యాలయాలకు త్వరలోనే సెలవులు ఇచ్చేస్తుంటారు. దీంతో వారి వారి స్వగ్రామాలకు, విహార యాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ చేసేసుకుంటున్నారు. రైల్వే శాఖ అలర్ట్ అయ్యింది. ప్రయాణీకులను సౌకర్యవంతంగా ఉండేందుకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయాలని భావించింది. అందులో భాగంగా ప్రయాణీకుల రద్దీ దృష్టిలో పెట్టుకుని వారి సౌకర్యార్థం 104 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే శాఖ ప్రకటించింది. సికింద్రాబాద్ – ఎర్నాకులం – సికింద్రాబాద్ మధ్య 26 ప్రత్యేక రైళ్లను, మచిలీపట్నం – కర్నూలు సిటీ – మచిలీపట్నం మధ్య 78 ప్రత్యేక రైళ్లను నడుపునన్నట్లు వెల్లడించింది. ఈ మేరకు 2022, మార్చి 19వ తేదీ శనివారం ఓ ప్రకటన జారీ చేసింది. ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరింది.

Read More : Sankranti Special Trains: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు

మచిలీపట్నం – కర్నూలు సిటీ – మచిలీపట్నం

ట్రై వీక్లీ స్పెషల్ ట్రైన్స్ నడుస్తాయని తెలిపింది. ఈ ప్రత్యేక రైళ్లు గుడివాడ, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, దొనకొండ, మార్కాపూర్ రోడ్డు, కుంభం గిద్దలూరు, నంద్యాల, డోన్ స్టేషన్ లో ఈ రైళ్లు ఆగుతాయని తెలిపింది.
ట్రైన్ నెంబర్ 07190.. ఏర్నాకులం నుంచి సికింద్రాబాద్ కు ఈ రైలు బయలుదేరుతుందని తెలిపింది. ఏప్రిల్ 02, 09, 16, 23, 30 తేదీలు, మే నెలలో 07, 14, 21, 28 తేదీల్లో, జూన్ నెలలో 04, 11, 18, 25 తేదీల్లో ప్రత్యేక రైళ్లు నడుస్తాయని తెలిపింది.

సికింద్రాబాద్ – ఎర్నాకులం – సికింద్రాబాద్

వీక్లీ స్పెషల్ ట్రైన్స్ నడుస్తాయని వెల్లడించింది. నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలర్పెట్టాయ్, సేలం, ఈరోబడ్, తిరుప్పూర్, కోయంబత్తూరు, పాల్గాట్, త్రిస్సూర్, అలువ స్టేషన్ లలో ఆగుతుందని దక్షిణ మధ్య రైల్వే శాఖ తెలిపింది.

Read More : Special Trains : ఆది, సోమవారాల్లో 12 ప్రత్యేక రైళ్లు

ట్రైన్ నెంబర్ 07189 సికింద్రాబాద్ నుంచి ఎర్నాకులంకు ఏప్రిల్ 01, 08, 15, 22 తేదీలు, మే నెలలో 06, 13, 20, 27 తేదీలు, జూన్ నెలలో 03, 10, 17, 24 తేదీల్లో ప్రత్యేక రైళ్లు నడుస్తాయని తెలిపింది. రాత్రి 09.05 గంటలకు బయలుదేరే ఈ రైలు తర్వాతి రోజు రాత్రి 08.15 నిమిషాలకు ఏర్నాకులం చేరుకుంటుందని పేర్కొంది.

ట్రైన్ నెంబర్ 07068 కర్నూలు సిటీ – మచిలీపట్నంకు ఏప్రిల్ 03, 06, 08, 10, 13, 15, 17, 20, 22, 24, 27, 29 తేదీల్లో ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు తెలిపింది. మే నెలలో 01, 04, 06, 08, 11, 13, 15, 18, 20, 22, 25, 27, 29 తేదీలు, జూన్ నెలలో 01, 03, 05, 08, 10, 12, 15, 17, 19, 22, 24, 26, 29 తేదీలు, జూన్ 01 తేదీన ప్రత్యేక రైళ్లను నడుస్తాయని తెలిపింది. ఈ రైళ్లు ప్రతి ఆదివారం, బుధవారం, శుక్రవారం రాకపోకలు సాగిస్తాయి.