Trains Canceled : భారీ వ‌ర్షాల ఎఫెక్ట్…34 ఎంఎంటీఎస్, 15 ప్యాసింజ‌ర్ రైళ్లు ర‌ద్దు

సికింద్రాబాద్, ఉందాన‌గ‌ర్, మేడ్చ‌ల్, బొల్లారం స్టేష‌న్ల మ‌ధ్య న‌డిచే ప‌లు రైళ్ల‌ను ర‌ద్దు చేశారు. సికింద్రాబాద్ – ఉందాన‌గ‌ర్ – సికింద్రాబాద్ ప్ర‌త్యేక ప్యాసింజ‌ర్ రైలు, సికింద్రాబాద్ – ఉందాన‌గ‌ర్ మెము ప్ర‌త్యేక రైలు, హెచ్ఎస్ నాందేడ్ – మేడ్చ‌ల్ – హెచ్ఎస్ నాందేడ్ ప్యాసింజ‌ర్ రైలు ర‌ద్దు అయింది.

Trains Canceled : భారీ వ‌ర్షాల ఎఫెక్ట్…34 ఎంఎంటీఎస్, 15 ప్యాసింజ‌ర్ రైళ్లు ర‌ద్దు

Trains (2)

trains canceled : తెలంగాణలో భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల కార‌ణంగా ద‌క్షిణ మ‌ధ్య రైల్వే అధికారులు అప్ర‌మ‌త్తం అయ్యారు. రేప‌టి నుంచి ఈ నెల 17వ తేదీ వ‌ర‌కు జంట న‌గ‌రాల ప‌రిధిలో న‌డిచే 34 ఎంఎంటీఎస్ రైళ్ల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్ల‌డించారు. రేప‌టి నుంచి 17వ తేదీ వ‌ర‌కు మ‌రో 15 ప్యాసింజర్ రైళ్ల‌ను కూడా ర‌ద్దు చేస్తున్న‌ట్లు అధికారులు ప్ర‌క‌టించారు.

సికింద్రాబాద్, ఉందాన‌గ‌ర్, మేడ్చ‌ల్, బొల్లారం స్టేష‌న్ల మ‌ధ్య న‌డిచే ప‌లు రైళ్ల‌ను ర‌ద్దు చేశారు. సికింద్రాబాద్ – ఉందాన‌గ‌ర్ – సికింద్రాబాద్ ప్ర‌త్యేక ప్యాసింజ‌ర్ రైలు, సికింద్రాబాద్ – ఉందాన‌గ‌ర్ మెము ప్ర‌త్యేక రైలు, హెచ్ఎస్ నాందేడ్ – మేడ్చ‌ల్ – హెచ్ఎస్ నాందేడ్ ప్యాసింజ‌ర్ రైలు ర‌ద్దు అయింది.

Trains Canceled : భారీ వర్షాల ఎఫెక్ట్.. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 10 రైళ్లు రద్దు

సికింద్రాబాద్ – మేడ్చ‌ల్ – సికింద్రాబాద్ మెము రైలు, సికింద్రాబాద్ – బొల్లారం – సికింద్రాబాద్ మెము రైల‌ను కూడా ర‌ద్దు చేశారు. అలాగే కాకినాడ పోర్టు- విజయవాడ స్టేషన్ల మధ్యలో నడిచే రెండు రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు.