చెత్తతో విద్యుత్.. సౌత్ ఇండియాలో ఫస్ట్ ప్లాంట్ ఇదే.. ప్రారంభించిన కేటీఆర్

  • Published By: vamsi ,Published On : November 10, 2020 / 12:59 PM IST
చెత్తతో విద్యుత్.. సౌత్ ఇండియాలో ఫస్ట్ ప్లాంట్ ఇదే.. ప్రారంభించిన కేటీఆర్

గ్రేటర్‌ హైదరాబాద్‌ మహానగరం నుంచి వెలువడుతున్న చెత్త నుంచి విద్యుత్‌ ఉత్పత్తి చేసే ప్లాంట్‌ గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరంలో ప్రారంభం అయ్యింది. మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా లాంఛనప్రాయ ప్రారంభోత్సవం జరిగింది. దక్షిణ భారతదేశంలోనే చెత్తనుంచి విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్న ఫస్ట్ ప్లాంట్‌ ఇదే. జవహర్‌నగర్‌లోని ఈ ప్లాంట్‌ మొదటి దశ పనులు ప్రయోగాత్మకంగా ప్రారంభం కాగా, ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రి చామకర మల్లారెడ్డి, నగర మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్ఎంసీ కమీషనర్ లోకేశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.



ప్లాంట్‌లోని రెండు బాయిలర్లకు గాను ప్రస్తుతం ఒకదాని ద్వారా రోజుకు 10 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేస్తుండగా.. ఇంటిగ్రేటెడ్‌ మునిసిపల్‌ సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ (IMSWAM) ప్రాజెక్ట్‌గా దీనిని వ్యవహరిస్తున్నారు. దీని ద్వారా రోజుకు 1000 నుంచి 1200 మెట్రిక్‌టన్నుల ఆర్డీఎఫ్‌ చెత్తతో విద్యుత్‌ ఉత్పత్తి చేస్తారు. గ్రేటర్ హైదరాబాద్ లో సేకరించే చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్‌ను మేడ్చల్ జిల్లాలోని జవహర్ నగర్ డంపింగ్ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది.



ఇటువంటి ప్రాజెక్టులు ఇప్పటికే ఢిల్లీ, అహ్మదాబాద్‌ రాష్ట్రాల్లో ఉండగా.. దక్షిణ భారతదేశంలోని తెలంగాణలో ఇది మొదటి ప్లాంట్‌. జవహర్‌నగర్‌లోని డంపింగ్‌ కేంద్రంలో ఉన్న ప్రత్యేక విద్యుత్‌ తయారీ ప్లాంట్‌ నుంచి రాంకీ సంస్థ వేస్టేజ్‌ నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తోంది. ఇప్పటి వరకు 51 లక్షల యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసింది. ఈ ప్లాంట్‌లో పర్యావరణహిత థర్మల్‌ కంబషన్‌ టెక్నాలజీతో విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. ఇలాంటివి ఢిల్లీ, జబల్‌పూర్‌లలో మాత్రమే ఉన్నాయి.



https://10tv.in/power-substations-automation-process-in-andhra-pradesh/
ఘన వ్యర్థాల నిర్వహణ ప్రాజెక్టులో భాగంగా వ్యర్థాలతో విద్యుత్‌ను ఉత్పత్తిచేసే ప్లాంటును ఏర్పాటుచేయాలని జీహెచ్‌ఎంసీ, రాంకీ ఎన్విరో మధ్య ఒప్పందం ఉంది. పర్యావరణానికి ఎటువంటి నష్టం జరుగకుండా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం(రెఫ్యూజ్‌ డీరైవ్డ్‌ ఫ్యూల్‌, ఆర్‌డీఎఫ్‌)తో విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుండగా.. బెల్జియంకు చెందిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇందులో ఉపయోగించి అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ప్లాంటును ఏర్పాటుచేసినట్లు అధికారులు తెలిపారు.