Hyderabad Rains : హైదరాబాద్‌లో వర్షం.. తడిసి ముద్దయిన నగరం
నైరుతి రుతుపవనాల రాకతో వారం రోజుల నుంచి తెలంగాణలో వర్షాలు పడుతున్నాయి. ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో వాన పడింది.

Hyderabad Rains : నైరుతి రుతుపవనాల రాకతో వారం రోజుల నుంచి తెలంగాణలో వర్షాలు పడుతున్నాయి. ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో వాన పడింది. సరూర్‌నగర్, కర్మన్‌ఘాట్, దిల్సుఖ్నగర్, బోయిన్పల్లి, మారేడుపల్లి, బేగంపేట్, అంబర్‌పేట, కాచిగూడ, నల్లకుంట గోల్నాక, కూకట్పల్లి, నిజాంపేట్, బాచుపల్లి, పంజాగుట్ట, అమీర్‌పేట్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లో వర్షం కురిసింది.
Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw
పలు చోట్ల నాలాలు పొంగిపొర్లాయి. వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రోడ్లపై వాన నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచింది. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశిస్తూనే వర్షాలను తీసుకొచ్చాయి. మరో రెండు రోజుల పాటు హైదరాబాద్ నగరంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరారు.
Southwest Monsoons : తెలంగాణలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు
రెండు రోజులుగా రాష్ట్రంలో వానలు పడుతున్నాయి. మేడ్చల్ జిల్లాలో అత్యధికంగా 9.1 సెంమీ వర్షపాతం నమోదైంది. అత్యల్పంగా సింగపూర్ టౌన్ షిప్ దగ్గర 5.6 సెంమీ వర్షం కురిసింది. రాష్ట్రానికి పశ్చిమ దిశ నుంచి గాలులు బలంగా వీస్తున్నాయని, రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది.
తెలంగాణలోనే కాదు ఏపీలోనూ పలు చోట్ల వర్షాలు పడుతున్నాయి. ఆదివారం విజయవాడలోనూ భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడింది. వాన నీటితో రోడ్లు జలమయం అయ్యాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
Telangana Rains: తెలంగాణలో ఎల్లో అలర్ట్, రెండ్రోజుల పాటు భారీ వర్షాలు
ఇన్నాళ్లు మండుటెండలతో ఉక్కిరిబిక్కిరి అయిన తెలుగు రాష్ట్రాల ప్రజలు వర్షాలు కురుస్తుండటంతో కాస్త రిలీఫ్ అవుతున్నారు. వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఉక్కపోత నుంచి ఉపశమనం లభిస్తోంది. ముందు ముందు మరిన్ని వానలు కురవాలని, వాతావరణం మరింత చల్లబడాలని కోరుకుంటున్నారు. మరోవైపు వానలు కురుస్తుండటంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పొలం బాట పట్టారు.
- Boyfriend Attempted Suicide : ప్రియురాలికి మరొకరితో పెళ్లి.. ఫంక్షన్ హాల్ వద్దే కిరోసిన్ పోసుకుని ప్రియుడు ఆత్మహత్యాయత్నం
- Metro Rail Stations : అద్దెకు మెట్రో స్టేషన్లు..రైల్ స్టేషన్లలో ఆఫీస్ బబుల్స్
- bjp: టీఆర్ఎస్తో మాకు పోటీ ఏంటీ?: బండి సంజయ్
- TET Results : తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల
- హైదరాబాద్‌లో విషాదానికి దారి తీసిన 9వ తరగతి ప్రేమకథ
1Nadendla Manohar : ఏపీకి ఒక్క పరిశ్రమ కూడా రాలేదు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అవార్డు ఎలా వచ్చింది?
2Minister Buggana : చంద్రబాబువి పచ్చి అబద్దాలు, రేట్లు పెరగడానికి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు- ఏపీ మంత్రులు
3Malaysia Open 2022 : క్వార్టర్ ఫైనల్లో ఓడిన సింధు, ప్రణయ్
4Godfather: గాడ్‌ఫాదర్ ఎంట్రీకి టైమ్ ఫిక్స్!
5Telangana Covid Updated List : తెలంగాణలో కరోనా కల్లోలం.. కొత్తగా ఎన్ని కేసులంటే
6presidential election 2022: ఇప్పుడు ద్రౌపది ముర్ము గెలిచే ఛాన్స్ బాగా ఉంది: మమతా బెనర్జీ చురకలు
7Actress Meena: భర్త చనిపోయారు.. దయచేసి అలా చేయకండి.. అంటూ మీనా ఓపెన్ లెటర్!
8The Warrior Trailer: హై వోల్టేజ్ ట్రైలర్‌తో ఆపరేషన్ స్టార్ట్ చేసిన రామ్!
9DRDO : దేశీయ మానవరహిత తొలి యుద్ధ విమానం.. పరీక్షించిన డీఆర్డీవో..!
10Enforcement Directorate: మనీలాండరింగ్ కేసు.. ఢిల్లీ మంత్రి సత్యేందర్ అనుచరులు ఇద్దరు అరెస్టు
-
Pavitra Lokesh: నరేశ్‌తో రిలేషన్‌పై పవిత్రా లోకేశ్ ఏమందంటే?
-
PAN-Aadhaar Link : ఆధార్-పాన్ ఇంకా లింక్ చేయలేదా? గడువు దాటింది.. డబుల్ ఫైన్ తప్పదు!
-
Congress, BJP Attack : హనుమకొండ బీజేపీ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత..కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు పరస్పర దాడి
-
Naresh: పవిత్రా లోకేష్ వివాదంపై నటుడు నరేశ్ క్లారిటీ!
-
Telangana Govt : రెసిడెన్షియల్ పాఠశాలలు జూనియర్ కళాశాలలుగా అప్ గ్రేడ్
-
WhatsApp : వాట్సాప్ 19 లక్షల భారతీయ అకౌంట్లను బ్యాన్ చేసింది.. ఎందుకంటే?
-
Bimbisara: ఓ యుద్ధం మీద పడితే ఎలా ఉంటుందో చూపిస్తానంటోన్న బింబిసారా!
-
Leopard : కర్నూలు జిల్లా కోసిగిలో చిరుత పులి కలకలం