Spa Centers : మ..మ..మసాజ్, ఒళ్లు రుద్దడానికి ఒక రేటు.. కాళ్లు పట్టడానికి ఇంకో రేటు

మసాజ్ సెంటర్ల ముసుగులో జరుగుతున్న బాగోతాన్ని 10TV బయటపెట్టడంతో ఒక్కసారిగా ప్రకంపనలు రేగుతున్నాయి.

Spa Centers : మ..మ..మసాజ్, ఒళ్లు రుద్దడానికి ఒక రేటు.. కాళ్లు పట్టడానికి ఇంకో రేటు

Spa Centers

Hyderabad : మసాజ్ సెంటర్ల ముసుగులో జరుగుతున్న బాగోతాన్ని 10TV బయటపెట్టడంతో ఒక్కసారిగా ప్రకంపనలు రేగుతున్నాయి. స్పా సెంటర్ ముసుగులో హైటెక్ ప్రాస్టిట్యూషన్ జరుగుతున్న విషయాన్ని టెన్ టీవీ ఎక్స్‌క్లూజివ్‌గా ప్రసారం చేసింది. నార్త్ నుంచి అమ్మాయిలను రప్పించి వ్యభిచారం చేయిస్తున్నారనే విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. స్పెషల్ సర్వీసుల పేరిట యువకులకు వల వేస్తూ… ఎలా దందా నిర్వహిస్తున్నారనే విషయాన్ని కళ్లకు కట్టింది. ఒక్కో సర్వీసుకు ఒక్కో రేటు ఫిక్స్ చేసిన నిర్వాహకులు.. యువకులకు గాలం వేస్తూ పచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నారు. కరోనా నిబంధనలు బేఖాతర్ చేస్తూ విటులను ఆకర్షిస్తున్నారు. 10TV కథనాలతో రంగంలోకి దిగిన పోలీసులు మసాజ్ సెంటర్లో దాడులు నిర్వహించారు. సెక్స్ దందాపై ఆరా తీశారు. స్పా సెంటర్ మొత్తం తనిఖీ చేశారు. కొత్తగూడ ఇష్ స్పా సెంటర్‌లో ఉండే సల్మాన్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Masage

అసలే కరోనా కాలం.. కనీసం మీటర్ దూరం డిస్టెన్స్ మెయిన్‌టేన్ చేయాలి. కానీ… ఆ నిబంధన అస్సలు పట్టదు. పైసలే పరమావధిగా మూడు మసాజ్‌లు ఆరుగురు కస్టమర్లు అన్నట్లుగా స్పా వ్యాపారం జరిగిపోతోంది. అయితే… అది పేరుకే స్పా.. మసాజ్ మాటున జరిగే వ్యవహారం వేరే ఉంటుంది. థాయ్ మసాజ్ పేరుతో క్రాస్ మసాజ్ జరుగుతోంది. అందమైన అమ్మాయిలతో యువకులకు వల వేస్తున్న నిర్వాహకులు.. గల్లీలో యదేచ్చగా గలీజ్ దందా నిర్వహిస్తున్నారు. లోకల్ అమ్మాయిలే కాదు నార్త్ నుంచి కూడా అమ్మాయిలను రప్పించి వ్యభిచారం నిర్వహిస్తున్నారు. అసలు స్పా సెంటర్లలో ఏం జరుగుతోంది. ఇదే అంశంపై టెన్ టీవీ ఇన్వెస్టిగేట్ చేసింది. మైండ్ బ్లాంక్ అయ్యే విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Masage 10tv Investigation

అడ్డదారుల్లో డ‌బ్బులు సంపాదించాల‌న్న ఆశ‌.. దీనికి అమ్మాయిలే పెట్టుబ‌డి.. ఇంకేముంది క‌ట్ చేస్తే మ‌సాజ్ సెంట‌ర్ బోర్డు.. హొయ‌లొలికే వ‌య్యారి భామ‌లే ఉద్యోగులుగా నియామ‌కాలు.. ఇలా న‌గ‌రంలో షార్ట్ క‌ట్‌లో కాసులు పండించాల‌నుకునే వారికి మసాజ్ సెంటర్లు అడ్డాగా మారాయి. స్పా సెంట‌ర్స్ కాస్తా.. సెక్స్‌ సెంటర్స్‌గా మారిపోయాయి. స్పా సెంటర్‌కు అబ్బాయిలు వచ్చారంటే నిర్వాహకులకు పండగే. తాము ఎంత బాగా మసాజ్ చేస్తామో వివరిస్తూనే.. ఎలాంటి సర్వీసులున్నాయో విప్పిచెబుతారు, విడమర్చి వివరిస్తారు. కస్టమర్లు మొహమాటం, సిగ్గుపడుతున్నారనిపిస్తే క్షణాల్లో బెరుకు పోగెట్టేస్తారు. తాము ఎలాంటి సర్వీస్ ఇస్తామో.. ఏ ఏ సర్వీసుకు ఎంత ఛార్జ్ చేస్తామో చెబుతూనే జనాలను టెంప్ట్ చేసి ముగ్గులోకి దింపేస్తారు.

Masage Kotaguda

ఆ తర్వాత మసాజ్ చేసే యువతి పూర్తిగా హద్దులు దాటుతుంది. హద్దులు దాటేలా కస్టమర్‌ను రెచ్చగొడుతుంది. ఆ తర్వాత ఒళ్లు రుద్దడానికి ఒక రేటు.. కాళ్లు పట్టడానికి ఇంకో రేటు.. ఇంకా కావాలంటే అంటూ సాగదీసి అసలు విషయం చెప్పేస్తారు. టాప్‌లెస్ మసాజ్ కావాలంటే ఇంకో మరో రేటు చెప్పి రెచ్చగొడతారు. గురుడు లైన్‌లోకి వచ్చాడని అర్థం కాగానే.. ఇంకాస్త ముందుకెళ్లి బాడీ టు బాడీ మసాజ్ మస్త్ ఉంటుందంటూ ఊరిస్తారు. ఒళ్లు నొక్కుతూనే నరాలు మెలేస్తారు. అక్కడి నుంచి ఇంకా ముందుకెళ్లేందుకు కూడా అభ్యంతరం లేదు. కానీ.. అది కావాలంటే అంటూ కాస్త నసుగుతారు. సెక్స్ కూడా ఓకే కానీ… కచ్చితంగా ఇంత ఇవ్వాల్సిందే అని కండిషన్ పెట్టి మరీ పని కానిచ్చేస్తారు. నరాలు మీటుతూ స్వర్గలోకం అంచుల దాకా తీసుకెళ్తారు. ఒక్కసారి వస్తే మళ్లీ మళ్లీ అదే స్పాకి వచ్చేలా కస్టమర్‌ను శాటిస్‍‌ఫై చేస్తారు.

శాటిస్‌ఫ్యాక్షన్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ.. ఇదీ స్పా సెంటర్ నిర్వాహకుల తీరు. ఒక్కసారి వచ్చిన కస్టమర్‌కు రెగ్యూలర్‌గా ఫోన్ చేస్తారు. సేవలు ఎలా ఉన్నాయంటూ ఆరా తీస్తారు. ఒక బ్రాంచ్‌లో సర్వీస్ నచ్చలేదా.. ఇంకో బ్రాంచ్‌కు రండి.. అక్కడ మీరు శాటిస్‌ ఫై అయ్యే రేంజ్‌లో కొత్త సర్వీసులు అందుబాటులో ఉన్నాయని ఊరిస్తారు. అసలు పోలీసుల భయమే అక్కర్లేదని భరోసా ఇస్తారు.

Read More : IPL 2021: కొవిడ్ వణుకు పుట్టిస్తుంటే ఐపీఎల్ నిర్వహించడం అవసరమేనా – గిల్‌క్రిస్ట్