Governor Tamilsai : తెలుగులో మాట్లాడుతూ..టీఆర్ఎస్ ప్రభుత్వంపై గవర్నర్ తమిళిసై సెటైర్లు

తెలంగాణలో తన మార్క్‌ను చూపిస్తున్న గవర్నర్ తమిళిసై తన పంతం నెగ్గించుకున్నారు. మహిళా దర్భార్ నిర్వహించి తీరుతాను అన్న ఆమె నిర్వహించి చూపించారు. మహిళా దర్భార్ లో తమిళిసై తెలుగులో ప్రసంగించటం మరో విశేషం. తెలుగులో మాట్లాడిన గవర్నర్ తమిళిసై టీఆర్ఎస్ ప్రభుత్వంపై సెటైర్లు వేశారు.

Governor Tamilsai : తెలుగులో మాట్లాడుతూ..టీఆర్ఎస్ ప్రభుత్వంపై గవర్నర్ తమిళిసై సెటైర్లు

Governor Tamilsai Satires On Trs Govt In Mahila Darbar

Governor tamilsai satires on trs govt in mahila darbar : తెలంగాణలో తన మార్క్‌ను చూపిస్తున్న గవర్నర్ తమిళిసై తన పంతం నెగ్గించుకున్నారు. మహిళా దర్భార్ నిర్వహించి తీరుతాను అన్న ఆమె నిర్వహించి చూపించారు. మహిళా దర్భార్ లో తమిళిసై తెలుగులో ప్రసంగించటం మరో విశేషం. తెలుగులో మాట్లాడిన గవర్నర్ తమిళిసై పరోక్షంగా టీఆర్ఎస్ ప్రభుత్వానికి చురకలు అంటించారు. ఆమె మాటల్లోనే..‘కొంతమంది మీరు గవర్నర్ రాజ్ భవన్ కు మాత్రమే పరిమితం అయి ఉంటారు ప్రజలను కలవలేరు అని అన్నారు..కానీ ప్రజలను నేరుగా కలిసాను..వారి సాధక బాధకాలు విన్నాను..నేను ప్రజలను కలవకుండా ఆపేశక్తి ఎవ్వరిలేదు. ప్రతీ ప్రభుత్వ కార్యాలయం ప్రజల కోసమే ఉంటుంది. వారి సమస్యలు తీర్చటానికే ఉంటుంది. ఆ సమస్యలను తీర్చటానికి వినటానికి ఎటువంటి అవరోధాలు ఉండవ్ అని అన్నారు.

Also read : TS Governor : రాజ్ భవన్ లో రాజకీయ కార్యక్రమాలా?గవర్నర్ త‌మిళి సై ‘మహిళా దర్బార్’ చేపట్టి లక్ష్మణ రేఖ దాటుతున్నారు: సీపీఐ నారాయణ

తెలంగాణ ప్రజల వాణిని నేను ముందుండి ప్రభుత్వానికి వినిపిస్తాను. తెలంగాణ ప్రజల కోసం బలమైన శక్తిగా నేను ఎప్పుడు ఉంటాను అని అన్నారు. నేను ఆందోళనలను..ఆందోళన కారులను ఎప్పుడు పట్టించుకోను..ప్రజల కోసం నేను గవర్నర్ ని అయినా సరే ముందుండి నిలబడతాను అని పునరుద్ఘాటించారు గవర్నర్ తమిళిసై. నేను గవర్నర్ ని అయినా బాధితుల స్వరాన్ని ప్రభుత్వానికి వినిపిస్తానన్నారు. మహిళా గొంతుకను ఈ ప్రభుత్వానికి వినిపిస్తానన్నారు. మహిళలకు తాను వారధిగా ఉంటానన్నారు. ఈ విషయంలో నాకు ఎదురు చెప్పే వాళ్లను పట్టించుకోను..పట్టించుకోవాల్సిన అవసరం లేనే లేదన్నారు. ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే చూస్తు ఊరుకోను..ఆ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానని తెలంగాణ మహఇళలకు సోదరిగా తాను వెన్నంటి ఉంటానని మహిళా దర్భార్ లో పాల్గొన్న మహిళలకు గవర్నర్ తమిళిసై భరోసా ఇచ్చారు.

Also read : Telangana Governor : తెలంగాణ గవర్నర్ కీలక నిర్ణయం

గవర్నర్ వర్సెస్ టీఆర్ఎస్ ప్రభుత్వం మధ్య నడిచిన వార్ ఇంకా కొనసాగుతునే ఉంది. పరస్పర ఆరోపణల మధ్య ఇప్పటికే రాజ్ భవన్ కి ప్రగతి భవన్ కి గ్యాప్ పెరిగింది. సమయం వచ్చినప్పుడల్లా గవర్నర్.. తెలంగాణ ప్రభుత్వంపై అసంతృప్తి తెలుపుతునే ఉన్నారు. దీనిలో భాగంగా మరోసారి తన మార్క్ ను చూపించేందుకు గవర్నర్ తమిళిసై మహిళా దర్భార్ ను నిర్వహించారు. గవర్నర్ అంటే రబ్బరు స్టాంప్ కాదు తాను కూడా ప్రజా సమస్యలను పరిష్కరించగలను అనే భరోసాను కల్పించటానికి రాజ్ భవన్‌లో మహిళా దర్భార్ నిర్వహించారు తమిళిసై.

ప్రగతిభవన్‌లో మంత్రులతో భేటీకానున్న సీఎం కేసీఆర్ మొన్నటి వరకు గ్రీవెన్ సెల్ ద్వారా ప్రజా సమస్యలు విన్న తమిళి సై ఇక మీదట గవర్నర్ హోదాలో స్వయంగా ప్రజల నుండి ఆమె ఫిర్యాదులు స్వీకరించనున్నారు. ప్రజాదర్భార్‌లో భాగంగా మహిళా దర్బార్ నిర్వహించేందుకు సిద్ధం అయ్యారు. మధ్యాహ్నం 12:00 నుండి 1:00 గంటల వరకు దర్బార్ నిర్వహించారు. గతంలో ఏ గవర్నర్ చేయని విధంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును ప్రజా సమస్యలకు వేదికగా చూపిస్తున్నారు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.