దుబ్బాక పోలింగ్: కరోనా పేషెంట్లకు స్పెషల్ టైమింగ్

  • Published By: sreehari ,Published On : November 3, 2020 / 08:34 AM IST
దుబ్బాక పోలింగ్: కరోనా పేషెంట్లకు స్పెషల్ టైమింగ్

Special timing for Covid-19 patients : దుబ్బాక ఉప ఎన్నిక ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. 148 గ్రామాల్లో 315 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కోవిడ్ బాధితుల కోసం ప్రత్యేక సమయాన్ని కేటాయించారు.



సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు కోవిడ్ బాధితుల కోసం పోలింగ్ నిర్వహించనున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. లక్షా 98 వేల మందికి పైగా ఓటర్లు.. తమ ఓటు హక్కును వినియోగించు కుంటున్నారు. మొదటి గంటలో 10 శాతం పోలింగ్ నమోదైంది.

ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు మరో 20 మంది అభ్యర్థుల భవితవ్యం కొద్ది గంటల్లోనే తేలబోతోంది. దుబ్బాక బైపోల్ పోలింగ్‌కు సర్వం సిద్ధం చేశారు అధికారులు. నియోజకవర్గంలోని 315 పోలింగ్ బూత్‌ల్లో.. 5 వేల మంది సిబ్బంది పనిచేయనున్నారు.



మొత్తం లక్షా 98 వేల 756 మంది ఓటర్లు.. మరోసారి తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎలక్షన్ కమిషన్ ఆదేశాలతో.. పూర్తిగా కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఎన్నికల అధికారులు పోలింగ్ నిర్వహిస్తున్నారు.



బరిలో 23 మంది అభ్యర్థులు :
దుబ్బాక ఉప ఎన్నిక బరిలో 23 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. టీఆర్ఎస్ నుంచి బరిలో సోలిపేట సుజాత రామలింగారెడ్డి పోటీ చేస్తుండగా.. కాంగ్రెస్ నుంచి శ్రీనివాసరెడ్డి, బీజేపీ నుంచి రఘునందన్ పోటీ చేస్తున్నారు.



https://10tv.in/ghaziabad-doctor-dates-married-patient-smothers-her-to-death/
89 సమస్యాత్మక కేంద్రాల వద్ద 2వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. చిట్టాపూర్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. బొప్పాపూర్‌లో రఘునందన్ రావు తన ఓటుహక్కును వినియోగించుకున్నారు.