రైల్వేలో 20నిమిషాల్లో అయిపోయిన బుకింగ్‌లు

  • Published By: vamsi ,Published On : May 12, 2020 / 02:28 AM IST
రైల్వేలో 20నిమిషాల్లో అయిపోయిన బుకింగ్‌లు

దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లలో ఇవాళ(12 మే 2020) నుంచి 15 రైళ్లు పరుగులు పెడుతున్న సంగతి తెలిసిందే. లాక్‌డౌన్ మధ్యలోనే ప్యాసింజర్ రైళ్లను నడపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా.. 2020 మే 11 న సాయంత్రం 4 గంటలకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటిసీ) వెబ్‌సైట్ మరియు రైల్ కనెక్ట్ యాప్ నుంచి టికెట్లు బుకింగ్ మొదలు పెట్టింది రైల్వేశాఖ.

అయితే టికెట్లు సాయంత్రం నాలుగు గంటలకే అమ్మకాలు మొదలవుతాయని ప్రకటించినా, వెబ్‌సైట్లో సాంకేతిక సమస్య కారణంగా రెండు గంటలు ఆలస్యం అయింది. మే 12 నుండి నడుస్తున్న రైళ్ల సమాచారాన్ని అప్‌లోడ్ చేయలేదని, అందువల్ల సాయంత్రం 6 గంటల నుండి బుకింగ్ చేయబడుతుందని రైల్వేశాఖ చెప్పింది. దీంతో ప్రజలు ఆరు గంటల నుండి IRCTC వెబ్‌సైట్ మరియు రైల్ కనెక్ట్ సైట్లలో యాప్‌లలో బుకింగ్ ప్రారంభించారు.

అయితే ఆరు గంటలకు బుకింగ్ ప్రారంభమైనా కూడా చాలా మందికి లోపం మారలేదు. ఐఆర్‌సిటిసి వెబ్‌సైట్ మరియు యాప్‌లో లాగిన్ అయినప్పుడు, కరోనా కారణంగా తదుపరి ఆర్డర్ వరకు బుకింగ్ మూసివేయడింది అంటూ నోటిఫికేషన్ వచ్చింది.

దీని తరువాత, రైల్వే నుంచి ఒక ప్రకటన వచ్చింది. 10 నిమిషాల్లో హౌరాకు వెళ్లే రైలు టిక్కెట్లన్నీ బుక్ అయిపోయాయి. అయినప్పటికీ వెబ్‌సైట్ క్రాష్ అవుతున్నట్లు చాలా మంది ఫిర్యాదు చేశారు. ఈ మార్గంలో నడుస్తున్న అన్ని రైళ్ల టైమ్ టేబుల్‌ను కూడా రైల్వేశాఖ జారీ చేసింది.

హావ్‌డా-ఢిల్లీల మధ్య నడిచే రైలులో ఏసీ-1, ఏసీ-3 టికెట్లన్నీ కేవలం పది నిమిషాల వ్యవధిలో, మిగిలిన అన్ని టికెట్లు 20 నిమిషాల వ్యవధిలో అయిపోయాయి. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌ నుంచి ఢిల్లీ వెళ్లే రైలులోని ఏసీ-1, ఏసీ-3 టికెట్లు 6.30 గంటలకల్లా (30 నిమిషాల్లో) అయిపోయాయి. మరోవైపు, వెబ్‌సైట్‌ క్రాష్‌ అయినట్లుగా వచ్చిన వార్తలను రైల్వే వర్గాలు ఖండించాయి. క్రాష్‌ కాలేదని స్పష్టంచేశాయి.

ఈ బుకింగ్ తరువాత, మే 12 నుంచి అగర్తాలా, హౌరా, పాట్నా, బిలాస్‌పూర్, రాంచీ, భువనేశ్వర్, సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నై, తిరువనంతపురం, మద్గావ్, ముంబై సెంట్రల్, అహ్మదాబాద్ మరియు జమ్మూ తవికి 15 రైళ్లు నడుస్తున్నాయి. తిరిగి రావడానికి కూడా  టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఏడు రోజులు పాటు టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. 

Read More: 

రైల్వే టిక్కెట్ల బుకింగ్ ప్రారంభం…IRCTC వెబ్ సెట్ పై హెవీ లోడ్

* శ్రామిక్ రైళ్ల సంఖ్య పెంపు… డెస్టినేషన్ స్టేట్ లో 3స్టాప్ లు