Sri Chaitanya Sathvik Case : విద్యార్థులను తిట్టినా, కొట్టినా చర్యలు.. ప్రైవేట్ కాలేజీలకు ప్రభుత్వం సీరియస్ వార్నింగ్

నార్సింగి శ్రీ చైతన ఇంటర్ కాలేజీ విద్యార్థి సాత్విక్ ఆత్యహత్య ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. చదువుల పేరుతో టీచర్లు పెట్టిన టార్చర్ తట్టుకోలేకనే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సాత్విక్ సూసైడ్ నోట్ లో రాశాడు. విద్యార్థి సూసైడ్ ఘటనను తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది.

Sri Chaitanya Sathvik Case : విద్యార్థులను తిట్టినా, కొట్టినా చర్యలు.. ప్రైవేట్ కాలేజీలకు ప్రభుత్వం సీరియస్ వార్నింగ్

Sri Chaitanya Sathvik Case : నార్సింగి శ్రీ చైతన ఇంటర్ కాలేజీ విద్యార్థి సాత్విక్ ఆత్యహత్య ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. చదువుల పేరుతో టీచర్లు పెట్టిన టార్చర్ తట్టుకోలేకనే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సాత్విక్ సూసైడ్ నోట్ లో రాశాడు. విద్యార్థి సూసైడ్ ఘటనను తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది.

Also Read..Satvik Case : సాత్విక్ సూసైడ్ లెటర్ లో పలు కీలక అంశాలు.. వీరి వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ ఆవేదన

నార్సింగి శ్రీ చైతన్య కాలేజీ పైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్లు రద్దు చేయాలని నిర్ణయించారు విద్యాశాఖ అధికారులు. విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు త్వరలో కమిటీని ఏర్పాటు చేస్తామని విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఇంటర్ కాలేజీల ప్రక్షాళనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందన్న అధికారులు.. విద్యార్థులను కాపాడేలా చర్యలు చేపడతామన్నారు.

Also Read..Satvik Case Report : శ్రీ చైతన్య కాలేజీ విద్యార్థి సాత్విక్ సూసైడ్.. ప్రభుత్వానికి ప్రాథమిక రిపోర్టు అందజేసిన ఎంక్వైరీ కమిటీ

ఇందులో భాగంగా విద్యార్థులను అసభ్య పదజాలంతో తిట్టినా, కొట్టినా కఠిన చర్యలు ఉంటాయని ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది ప్రభుత్వం.

కాగా.. సూసైడ్ లెటర్ లో కీలక అంశాలను సాత్విక్ ప్రస్తావించాడు. కాలేజీ ప్రిన్సిపల్, లెక్షరర్ పెట్టే టార్చర్ ను సూసైడ్ లెటర్ లో పేర్కొన్నాడు. కాలేజీ ప్రిన్సిపల్ కృష్ణారెడ్డి, ఇంచార్జ్ ప్రిన్సిపల్ ఆచార్య, శోభన్, నరేశ్ వేధింపులు తట్టుకోలేకపోయానని, తాను ఉంటున్న హాస్టల్ లో వీరు నలుగురు కలిసి విద్యార్థులకు నరకం చూపిస్తున్నారని వాపోయాడు. వారి వేధింపులు తట్టుకోలేకనే ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాని సాత్విక్ సూసైడ్ నోట్ లో పేర్కొన్నాడు.

తనను వేధించిన ఆ నలుగురిపై యాక్షన్ తీసుకోవాలని కోరాడు. చివర్లలో అమ్మా నాన్న లవ్ యూ, మిస్ యూ ఫ్రెండ్స్ అంటూ సూసైడ్ లెటర్ లో సాత్విక్ పేర్కొన్నాడు. ఈ పని చేస్తున్నందుకు క్షమించాలని తల్లిదండ్రులను కోరాడు.

కాలేజీ హాస్టల్‌ నుంచి సాత్విక్‌ సామగ్రిని తీసుకుంటున్న సమయంలో అతడి దుస్తుల మధ్య సూసైడ్‌ నోట్‌ బయటపడింది. అందులో ప్రిన్సిపాల్‌ కృష్ణారెడ్డి, అడ్మిన్‌ ప్రిన్సిపాల్‌ ఆచార్య, శోభన్, క్యాంపస్‌ ఇన్‌చార్జి నరేశ్‌ల వేధింపులు భరించలేకనే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు సాత్విక్‌ రాశాడు. తనతోపాటు తన మిత్రులకూ వారు నరకం చూపిస్తున్నారని, వారిపై సీరియస్‌ యాక్షన్‌ తీసుకోవాలని కోరాడు.

Also Read..Ramanthapur : అదృశ్యమైన విద్యార్థి అనూష మృతి.. రామంతాపూర్ చెరువులో మృతదేహం లభ్యం

విద్యార్థుల ఆత్మహత్యలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. చదువుల ఒత్తిళ్లు విద్యార్థుల చావులకు కారణమవుతున్నాయి. మానసిక ఒత్తిడికి గురవుతున్న విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. సాత్విక్ ఘటన మరువక ముందే అనూష ఘటన వెలుగుచూసింది. రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. పిల్లలు ప్రయోజకులవుతారని ఎన్నో ఆశలతో తల్లిదండ్రులు చదివిస్తుంటే.. పిల్లలు తీసుకునే కఠిన నిర్ణయాలు మాత్రం కన్నవారికి కడుపు కోతలే మిగులుస్తున్నాయి.