Sri Rama Shobhayatra : హైదరాబాద్ లో శ్రీ రాముని శోభాయాత్ర.. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు, పోలీసులు హై అలర్ట్

హైదరాబాద్ లో శ్రీరాముని శోభాయాత్ర నేపథ్యంలో పోలీసులు హై అలెర్ట్ ప్రకటించారు. శ్రీ రాముని శోభాయాత్రకు పోలీలు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శ్రీరాముడి శోభాయాత్ర సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

Sri Rama Shobhayatra : హైదరాబాద్ లో శ్రీ రాముని శోభాయాత్ర.. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు, పోలీసులు హై అలర్ట్

Sri Rama Shobhayatra

Sri Rama Shobhayatra : హైదరాబాద్ లో శ్రీరాముని శోభాయాత్ర నేపథ్యంలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. శ్రీ రాముని శోభాయాత్రకు పోలీలు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శ్రీరాముడి శోభాయాత్ర సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. గురువారం మధ్యాహ్నం 1 గంటలకు శోభాయాత్ర ప్రారంభం కానుంది. సీతారామ్ బాగ్ ఆలయం నుండి సుల్తాన్ బజార్ హనుమాన్ వ్యాయామశాల వరకు శోభాయాత్ర సాగనుంది. సీసీ కెమెరా, పోలీస్ నిఘా నీడలో 6 కిలో మీటర్ల మేర శోభాయాత్ర సాగనుంది.

దూల్ పెట్ సీతారాంబాగ్ ఆలయం నుండి శోభాయాత్ర ప్రారంభమై అక్కడి నుండి బోయగూడ కమాన్, మంగళ్ హాట్ జాలి హనుమాన్, దూల్ పేట, పురానాపూల్, జుమేరాత్ బజార్, చుడిబజార్, బేగంబజార్ చత్రి, బర్తన్ బజార్, సిద్ధంబర్ బజార్ మసీదు, శంకర్ షేర్ కోటల్, గౌలిగూడ కమాన్, గురుద్వారా, పుల్లిబౌలి బౌరస్తా, కోఠి ఆంధ్రా బ్యాంక్ మీదుగా సుల్తాన్ బజార్ లోని హనుమాన్ వ్యాయామశాలకు యాత్ర చేరుకోనుంది. శ్రీ రాముడి శోభాయాత్ర రూట్ మ్యాప్ లో ట్రాఫిక్ ఆంక్షలు విధించడతోపాటు పలు చోట్ల ట్రాఫిక్ ను మళ్లించారు.

Viral Video : శ్రీరామ నవమి వేడుకల్లో పాల్గొన్న కోతి-వైరల్ వీడియో

శ్రీరామ నవమి శోభాయాత్ర నేపథ్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. గురువారం సీతారామ్ బాగ్ లో మొదలయ్యే యాత్ర సుల్తాన్ బజార్ లోని హనుమాన్ వ్యాయామశాల వరకు సాగనుంది. గురువారం 30 మార్చి ఉదయం 11 నుంచి రాత్రి 10 గంటల వరకు వేర్వేరు ప్రాంతాల్లో, వేర్వేరు సమయాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించడంతోపాట ట్రాఫిక్ ను మళ్లించారు.

గురువారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 వరకు మల్లేపల్లి చౌరస్తా, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4 వరకు బోయిగూడ కమాన్, గౌలిపుర చౌరస్తా, ఘోడే కి ఖబర్, సాయంత్రం 4 నుంచి 5 వరకు పురానాపూల్ ఎక్స్ రోడ్, ఎంజే బ్రిడ్జ్, లేబర్ అడ్డా, సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు అలాస్కా టి జంక్షన్, ఎస్ఏ బజార్ యూ టర్న్, ఎంజే మార్కెట్, సాయంత్రం 4 నుంచి 6 వరకు అఫ్జల్ గంజ్ జంక్షన్ వద్ద పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

Bhadradri : భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణం.. మిథిలా స్టేడియంలో భారీ ఏర్పాట్లు

సాయంత్రం 5 నుంచి రాత్రి 7 వరకు రంగమహల్ టీ జంక్షన్, పుల్లిబౌలి చౌరస్తా, సాయంత్రం 6 నుంచి రాత్రి 8 వరకు ఆంధ్రా బ్యాంక్ ఎక్స్ రోడ్స్, డీఎం అండ్ హెచ్ఎస్ ఎక్స్ రోడ్స్, సుల్తాన్ బజార్ చౌరస్తా, చాదర్ ఘాట్ చౌరస్తా. రాత్రి 7 నుంచి 9 వరకు కాచి గూడ ఐనాక్స్, జీపీఓ అబిడ్స్, రాత్రి 7 నుంచి 10 గంటల వరకు బొగ్గులకుంట చౌరస్తాలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సాధారణ వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచించారు.