Warangal MGM Victim Died : వరంగల్‌ ఎంజీఎంలో ఎలుకలదాడిలో గాయపడిన బాధితుడు మృతి

కిడ్నీ సమస్యతో శ్రీనివాస్ కొద్ది రోజుల క్రితం వరంగల్ ఎంజీఎంలో చేరాడు. ఆర్‌ఐసియూలో చికిత్స పొందుతుండగా.. ఎలుకలు అతడిపై దాడి చేశాయి.

Warangal MGM Victim Died : వరంగల్‌ ఎంజీఎంలో ఎలుకలదాడిలో గాయపడిన బాధితుడు మృతి

Mgm Incident

Warangal MGM Victim Died : వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఎలుకలదాడిలో గాయపడిన బాధితుడు శ్రీనివాస్ మృతి చెందాడు. ఇవాళ తెల్లవారుజామున హైదరాబాద్ నిమ్స్‌లో చికిత్స పొందుతూ చనిపోయాడు. నిన్న అతడి పరిస్థితి విషమించడంతో.. వరంగల్ ఎంజీఎం నుంచి హైదరాబాద్ నిమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతూ మరణించాడు. అయితే శ్రీనివాస్ కిడ్నీ సమస్యతో కొద్ది రోజుల క్రితం వరంగల్ ఎంజీఎంలో చేరాడు. ఆర్‌ఐసియూలో చికిత్స పొందుతుండగా.. ఎలుకలు అతడిపై దాడి చేశాయి. అతడి చేతి వేళ్లను కొరుక్కుతిన్నాయి. శుక్రవారం సాయంత్రం అతడి ఆరోగ్యం విషమించడంతో ఎంజీఎం నుంచి నిమ్స్‌కు తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు.

వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో వైద్యం కోసం వెళ్లిన శ్రీనివాస్ అనే పేషెంట్‌ను ఎలుకలు గాయపరిచాయి. ఆర్ఐసీయూలో అపస్మారక స్థితిలో ఉన్న బాధితుడి కాలు, చేతి వేళ్లను ఎలుకలు కొరికేశాయి. ఎలుకల దాడిలో అతడికి తీవ్ర రక్తస్రావమైంది. శ్రీనివాస్ నాలుగు రోజుల క్రితమే ఎంజీఎంలో అడ్మిట్ అయ్యాడు. తొలిరోజునే అతడి కుడిచేయి వేళ్లను ఎలుకలు కొరికాయి. హన్మకొండ జిల్లా భీమారానికి చెందిన శ్రీనివాస్‌.. ఊపిరితిత్తులు, కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాడు. గత కొన్ని రోజులుగా ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీనివాస్‌కు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డాడు.

Warangal : MGM సూపరింటెండెంట్‌‌ని బదిలీ చేయడం ఘోరం.. సోమవారం కార్యచరణ ప్రకటన!

దాంతో అతన్ని వెంటనే వరంగల్ ఎంజీఎంకు తరలించారు. అక్కడే నాలుగు రోజుల నుంచి చికిత్స పొందుతున్నాడు. డయాలసిస్ చికిత్స కోసం ఆస్పత్రిలో చేరిన నాటి నుంచే శ్రీనివాస్‌పై ఎలుకలు దాడి చేస్తున్నాయి. అతడి రెండు చేతులు, రెండు కాళ్లను ఎలుకలు కొరికి తీవ్రంగా గాయపరిచాయి. గతంలోనూ ఇదే పరిస్థితి తలెత్తిందని ఇతర పేషెంట్లు ఫిర్యాదు చేస్తున్నారు. అదే వార్డులో చాలామంది పేషెంట్లు ఎలుక దాడికి గురయ్యారని వాపోతున్నారు.