Telangana 10th Exams: తెలంగాణలో పదో తరగతి పరీక్షలకు అంతా సిద్ధం

రాష్ట్ర వ్యాప్తంగా 2,861 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. మొత్తం 5,09,275 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. వీరిలో 2,58,098 మంది బాలురు, 2,51,177 మంది బాలికలు ఉన్నారు

Telangana 10th Exams: తెలంగాణలో పదో తరగతి పరీక్షలకు అంతా సిద్ధం

Ssc

Telangana 10th Exams: తెలంగాణలో సోమవారం నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈమేరకు పరీక్షా కేంద్రాల వద్ద అంతా సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు. మే 23 నుంచి మే 25 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 2,861 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. మొత్తం 5,09,275 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. వీరిలో 2,58,098 మంది బాలురు, 2,51,177 మంది బాలికలు ఉన్నారు. కరోనా నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యం, సిలబస్ వంటి విషయాలను దృష్టిలో ఉంచుకుని పరీక్షల్లో మార్పులు చేసింది తెలంగాణ ఎస్ఎస్సీ బోర్డు. సిలబస్ ను 80 శాతం తగ్గించిన బోర్డు, ఆమేరకు పరీక్షా పేపర్ లను 11 నుంచి 6 పేపర్లకు కుదించింది. జనరల్ సైన్స్ లో ఫిజిక్స్, బయాలజీ పేపర్లకు వేర్వేరుగా పరీక్ష నిర్వహించనున్నారు.

Other Stories:Lakshya Sen met Modi: ప్రధాని మోదీ అడిగిన ఆ ‘చిన్ని కోరిక’ తీర్చిన భారత స్టార్ షట్లర్

పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసారు. పేపర్ లీక్, మాస కాపీయింగ్ వంటి వాటికీ తావివ్వకుండా పరీక్షల నిర్వహణకు వచ్చే సిబ్బందిని, మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. పరీక్ష రాసేందుకు వచ్చే విద్యార్థులు ఉదయం 8.30 గంటలకే పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకోవాలని అధికారులు సూచించారు. 9.35 గంటల తరువాత విద్యార్థులను పరీక్షకు అనుమతించేది లేదని స్పష్టం చేశారు. విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడపనున్నారు. రాష్ట్రంలో ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని పరీక్షా కేంద్రాల వద్ద ఒక ఏఎన్ఎం, ఒక ఆశా వర్కర్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మంచి నీరు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు.

Other Stories:Srisailam Reservoir : శ్రీశైలం జలాశయంలోకి వరదనీరు