State consumer commission: రూ.16లక్షలు కట్టాల్సిందే.. ఫలించిన యువతి 20ఏళ్ల పోరాటం..

20ఏళ్లుగా యువతి, ఆమె కుటుంబ సభ్యులు చేస్తున్న పోరాటానికి ఫలితం దక్కింది. వైద్యుడి నిర్లక్ష్యంగా అరచేతిని కోల్పోయిన యువతి, ఆమె కుటుంబ సభ్యులు వైద్యుడు, బీమా సంస్థపై కొనసాగించిన పోరాటానికి ...

State consumer commission: రూ.16లక్షలు కట్టాల్సిందే.. ఫలించిన యువతి 20ఏళ్ల పోరాటం..

State Consumer Commission I

STATE CONSUMER COMMISSION: 20ఏళ్లుగా యువతి, ఆమె కుటుంబ సభ్యులు చేస్తున్న పోరాటానికి ఫలితం దక్కింది. వైద్యుడి నిర్లక్ష్యంగా అరచేతిని కోల్పోయిన యువతి, ఆమె కుటుంబ సభ్యులు వైద్యుడు, బీమా సంస్థపై కొనసాగించిన పోరాటానికి రాష్ట్ర వినియోగదారుల కమిషన్ తుదితీర్పు వెలువరించింది. వైద్యుడు, బీమా సంస్థ కలిసి వడ్డీతో సహా యువతి కుటుంబానికి రూ. 16లక్షలు కట్టాల్సిందేనంటూ తేల్చిచెప్పింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. 2003 సంవత్సరంలో వరంగల్ జిల్లా హసన్ పర్తికి చెందిన డి. రమేష్ బాబు జ్వరంతో బాధపడుతున్న తన నాలుగేళ్ల కుమార్తె సౌమ్యను హనుమకొండలోని డాక్టర్ రమేష్ బాబు వద్దకు తీసుకెళ్లారు. వైద్యుడు చికిత్స అందించి రెండు రోజుల తరువాత డిశ్చార్జి చేశారు.

Work from home: వర్క్‌ ‌ఫ్రమ్‌ హోం వల్ల వచ్చే ఇబ్బందులేంటో చెప్పిన.. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్

అయితే డిశ్చార్జి అయిన మరుసటి రోజు సెలైన్ ఎక్కించడానికి ఇంజెక్షన్ ఇచ్చిన కుడిచేయికి వాపువచ్చి నొప్పి పెరిగింది. దీంతో చిన్నారి తల్లిదండ్రులు తిరిగి వైద్యుడిని సంప్రదించగా హైదరాబాద్ లోని మరో ప్రైవేట్ వైద్యుడి వద్దకు వెళ్లాలని సూచించారు. అక్కడ చూపించే ఆర్థిక స్థోమతలేక పోవటంతో వరంగల్ జిల్లా కేంద్రంలోని ఎంజీఎం ఆస్పత్రి వైద్యులను సంప్రదించారు. అక్కడి వైద్యులు పరీక్షలు నిర్వహించి ఇన్ఫెక్షన్ సోకిందని అరచేయిని తొలగించారు. ఇన్ఫెక్షన్ రావడానికి వైద్యుడి నిర్లక్ష్యమే కారణమంటూ యువతి తండ్రి జిల్లా వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించాడు. 2016లో బాధిత కుటుంబానికి వైద్యుడు, ఇన్సూరెన్స్ సంస్థ సంయుక్తంగా గానీ, విడివిడిగా కానీ రూ. 16లక్షలు పరిహారం చెల్లించాలని జిల్లా వినియోగదారుల ఫోరం తీర్పునిచ్చింది.

Ministar ktr: నేటి నుంచి మంత్రి కేటీఆర్ విదేశీ పర్యటన.. ఎన్నిరోజులంటే..

దీన్ని సవాలు చేస్తూ వైద్యుడు, ఇన్సూరెన్స్ కంపెనీ విడివిడిగా రాష్ట్ర వినియోగదారుల కమిషన్ లో అప్పీళ్లు దాఖలు చేశారు. వీటిపై వినియోగదారుల కమిషన్‌ అధ్యక్షుడు జస్టిస్‌ ఎమ్మెస్కే జైశ్వాల్‌, సభ్యులు మీనారామనాథన్‌, కె.రంగారావులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. బాధిత కుటుంబం పక్షాన న్యాయవాది వి.గౌరీశంకరరావు వాదనలు వినిపించారు. వాదనలను విన్న ధర్మాసనం.. సెలైన్‌ ఇవ్వడానికి అమర్చాల్సిన పైపు విషయంలో డాక్టర్‌ నిర్లక్ష్యంగా వ్యవహరించారని నిర్ధారణకు వచ్చింది. జిల్లా ఫోరం తీర్పును సవరించి.. వైద్యుడి, బీమా సంస్థ అప్పీళ్లను కొట్టివేసింది. బాధితురాలికి తగిన పరిహారాన్ని వడ్డీ సహా చెల్లించాల్సిందేనంటూ తీర్పునిచ్చింది.