BRS Leaders : బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలి : బీఆర్ఎస్ నేతలు

బయ్యారం, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలను కనుమరుగు చేసి 1800 కిలోమీటర్ల దూరంలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టాలని కేంద్రం చేస్తోందని ఆరోపించారు. మంగళవారం ఇదే విషయాన్ని కేటీఆర్ స్పష్టంగా చెప్పారని పేర్కొన్నారు.

BRS Leaders : బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలి : బీఆర్ఎస్ నేతలు

BRS Leaders

BRS Leaders : బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాల్సిందేనని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై కేటీఆర్ స్పష్టంగా చెప్పారని బీఆర్ఎస్ ఎంపీ కవిత అన్నారు. 2014 నుండి సీఎం కేసిఆర్ పలుమార్లు కేంద్రాన్ని, ప్రధాని మోదీని కలిసి అడిగారని పేర్కొన్నారు. కేటీఆర్ కూడా కేంద్రాన్ని స్వయంగా కలిసి విజ్ఞప్తి చేశారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అదానీకి లాభం చేకూర్చే విధంగా చర్యలు తీసుకుంటుందని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థల బలోపేతం కోసం కేసీఆర్ కృషి చేస్తున్నారని చెప్పారు.

బయ్యారం ఉక్కు గురించి ఒక్క మాట కూడా కాంగ్రెస్ మాట్లాడటం లేదన్నారు. బండి సంజయ్ ఎలక్షన్ ముందు రాజకీయాలు చేస్తున్నారని పేర్కొన్నారు. పేపర్ లీకేజీ విషయంలో బీఆర్ఎస్ పై కుట్రలు చేస్తున్నారని వెల్లడించారు. బైలడిల్లలో ఉన్న ఉక్కును అదానీకి కట్టబెట్టేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. బైలాడిల్ల ఐరన్ ఓర్ అదానీకి ఇవ్వకూడదన్నారు. కచ్చితంగా బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాల్సిందేనని స్పష్టం చేశారు.

Bayyaram Steel : బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ సాధ్యం కాదు అన్న కేంద్రం..టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దీక్ష

బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై అన్ని పార్టీలు కలిసి రావాని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పిలుపునిచ్చారు. అందరం కలిసి వెళ్తే బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ సాధించవచ్చన్నారు. బడ్జెట్ సమావేశాలు ఒక్క రోజు కూడా సాగలేదని విమర్శించారు. 13 నుండి 18 నిమిషాల్లోనే బడ్జెట్ ఆమోదించారని పేర్కొన్నారు. ప్రతి ఒక్క ఎంపీ ఈ విషయంలో కలిసి రావాలని కోరారు. 18 ప్రతి పక్ష పార్టీలు అందరూ కలిసి మోదీకి వ్యతిరేకంగా నిరసనలు పార్లమెంట్ లో తెలిపామని చెప్పారు. బైలాధిల్ల ఉక్క ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాల్సిందేనని స్పష్టం చేశారు.

తెలంగాణ, ఏపీలో వేర్వేరు స్టీల్ ఫ్యాక్టరీలు పెట్టాలని తెలంగాణ విభజన చట్టంలో కేంద్రం చెప్పిందని మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఐరన్ గనులు నిక్షేపంగా ఉన్నాయని పేర్కొన్నారు. అక్కడ ఐరన్ ఓర్ గనులు లేవని మళ్ళీ కేంద్రం ఆరోపBRS Leadersణలు చేస్తుందని చెప్పారు. బైలడిల్ల నుండి ఐరన్ ఒర్ ఇస్తే ఇక్కడున్న గనులతో ఫ్యాక్టరీ పెట్టొచ్చన్నారు.

Bayyaram Steel Plant : దమ్ముంటే.. బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టాలి- సీఎం కేసీఆర్‌కు కిషన్ రెడ్డి సవాల్

బయ్యారం, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలను కనుమరుగు చేసి 1800 కిలోమీటర్ల దూరంలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టాలని కేంద్రం చేస్తోందని ఆరోపించారు. మంగళవారం ఇదే విషయాన్ని కేటీఆర్ స్పష్టంగా చెప్పారని పేర్కొన్నారు. దీనిపై కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని తెలిపారు.

బీజేపీ, కాంగ్రెస్ తెరచాటు ఒప్పందాలు చేసుకుని తెలంగాణకు అన్యాయం చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రైవేటీకరణ వ్యతిరేకమే తమ పార్టీ విధానం అన్నారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీతో సుమారు 20 వేల ఉద్యోగాలు వచ్చేవన్నారు. పెట్టుబడి కింద రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం భరించడానికి సిద్ధంగా ఉందని కేటీఆర్ చెప్పారని గుర్తు చేశారు.