హైదరాబాద్ లో కూతురిపై సవతి తండ్రి లైంగిక దాడి, మానవ మృగాల్లో మార్పు ఎప్పుడొస్తుంది

హైదరాబాద్ లో కూతురిపై సవతి తండ్రి లైంగిక దాడి, మానవ మృగాల్లో మార్పు ఎప్పుడొస్తుంది

Step Father sexually assaults : అతడికి పెళ్లైంది, ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు పెళ్లిళ్లు చేసుకున్నాడు. అయినా అతనిలోని కామవాంఛ చల్లారలేదు. ఏకంగా కూతురిపై కన్నేశాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో లైంగిక దాడికి ప్రయత్నించాడు. రోజుల తరబడి వేధించాడు, విషయం బయటకు చెబితే చంపేస్తానంటూ బెదిరించాడు. చివరకు విషయం తల్లికి తెలియడంతో అతని పాపం పండింది. హైదరాబాద్‌లోని టప్పచబుత్రా ప్రాంతానికి చెందిన షపీయుల్లాకు మాయలు మంత్రాలు వస్తాయని స్థానికంగా పేరుంది. క్షుద్ర పూజలు చేస్తాడని అంతా భయపడతారు. ఈ భయాన్ని అడ్డుపెట్టుకుని ఒకరికి తెలియకుండా మరొకరిని ఇలా ఐదుగురిని పెళ్లి చేసుకున్నాడు.

ఇది చాలదన్నట్టు ఏకంగా కూతురిపైనే లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆసిఫ్‌నగర్‌కి చెందిన ఓ మహిళ భర్తతో విడిపోయి తన కుమార్తెతో కలిసి జీవిస్తోంది. తనకు పెళ్లి కాలేదంటూ షఫియుల్లా ఆ మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆ మహిళ కుమార్తెకు తండ్రిగా ఉంటూ రక్షణ కల్పించాల్సి వాడు భక్షకుడిగా మారిపోయాడు. కామంతో కళ్లు మూసుకుపోయి మైనర్‌ అని చూడకుండా తన కామవాంఛతో నిత్యం ఆ బాలికను వేధింపులకు గురి చేశాడు. చివరకు లైంగికదాడికి పాల్పడుతుండగా గమనించిన తల్లి అడ్డుకుంది.

తన బండారం బట్టబయలైపోవడంతో షఫియుల్లాలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. విషయం బయటకు చెబితే చంపేస్తానంటూ బెదిరించాడు. అయితే అతని తీరు నచ్చని తల్లికూతుళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రోజుకో చోట కామాంధులు రెచ్చిపోతునే ఉన్నారు. ఇలాంటి కిరాతకుల్లో మార్పు ఎందుకు రావడం లేదని అర్ధం కాని పరిస్థితి. మమ్మల్ని ఎవరెం చేస్తారులేనన్న ధైర్యమా..? పోలీసులకు దొరికినా కొన్నాళ్లు జైల్లో ఉండి రావొచ్చులే అన్న ధీమానా..? ఇలాంటి మానవ మృగాళ్లో…మార్పు రావాలంటే ఇంకెన్ని చట్టాలు రావాలో..

https://youtu.be/ZIymS6NxfCU