Strange Village : సాయంత్రమే తెలియని గ్రామం-ఆలస్యంగా సూర్యోదయం..వేగంగా సూర్యాస్తమయం

సాయంత్రమే తెలియని ఈ గ్రామస్తుల జీవన విధానంగా కూడా కొంచెం భిన్నంగానే ఉంటుంది. సాధారణంగా ఉదయం ఆలస్యంగా లేచే అలవాటు ఉన్నవారు ఎవరైనా ఈ ఊరికి వస్తే మాత్రం ఇంకా ఆలస్యంగా మేలుకోవాలి. ఎందుకంటే ఈ గ్రామంపై ఆలస్యంగా సూర్యుడి వెలుగు పడుతుంది.

Strange Village : సాయంత్రమే తెలియని గ్రామం-ఆలస్యంగా సూర్యోదయం..వేగంగా సూర్యాస్తమయం

Strange Village

Strange village : సాధారణంగా రోజుకు నాలుగు పూటలు ఉంటాయి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి. కానీ ఆ గ్రామంలో మాత్రం ఇందులో ఒకటి మిస్ అయిపోతుంది. ఇప్పటి వరకు ఆ గ్రామస్తులు ఇప్పటివరకు సాయంత్రం ఎలా ఉంటుందో చూడలేదు. మనకు సూర్యాస్తమయం అయ్యే రెండు మూడు గంటల ముందే అక్కడ చీకటి పడిపోతుంది. ఆ విచిత్ర గ్రామం ఆఫ్రికా అడవుల్లోనో.. అంటార్కిటికా ఖండం లోనో లేదు. మన తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలోనే ఉంది.

ఇదే ఆ విచిత్ర గ్రామం. దీనిపేరు కొదురుపాక… అంతా మూడుజాముల కొదురుపాక అని పిలుస్తారు. ఇది పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో ఉంది. కొదురుపాకలో సాయంత్రం కనిపించదు. అసలు ఆ మాటే వినిపించదు. సాయంత్రం 4 గంటలకే చీకటి కమ్మేస్తుంది. ఇక్కడ మూడు జాములే ఉంటాయి.. అందుకే దీనికి మూడు జాముల కొదురుపాక అని పేరొచ్చింది. ఈ గ్రామం పచ్చటి పొలాలతో చుట్టూ పారే కానాల వాగుతో చల్లటి గాలులు, స్వచ్ఛమైన గాలి నడుమ ఎంతో అందంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది.

strange custom : మేడలేని ఊరు…అంతస్తుల భవంతి నిర్మిస్తే అశుభమంట… ఆ గ్రామంలో వింత ఆచారం

ఇక్కడ మరో వింత ఏంటంటే.. ఉదయం పూట సూర్యుడు కూడా ఆలస్యంగానే దర్శనమిస్తాడు. అంటే రోజులో ఎక్కువసేపు ఇక్కడ చీకటే ఉంటుంది. సాయంత్రం 4 గంటలు దాటిందంటే చాలు.. గ్రామాల్లోని వీధి దీపాలు, ఇళ్లల్లో లైట్లు వెలుగుతుంటాయి. ఎందుకంటే అప్పటికే పూర్తిగా చీకటి పడిపోతుంది. ఆపాటికే అంతా పనులు ముగించుకుని ఇళ్లకు చేరుకుంటారు. కొదురుపాక గ్రామ ప్రజలు సాయంత్రం సమయాన్ని చూడాలంటే పక్క ఊరికి వెళ్లాల్సిందే. ఏవరైన కొత్త వారు గ్రామంలోకి వస్తే… ఇక్కడి పరిస్థితులు చూసి ఒకింత ఆశ్చర్యానికి గురవుతారు.

కొదురుపాకలో వేగంగా చీకటి పడడం వెనుక పెద్ద వింతేమీ లేదు. చుట్టూ ఉన్న కొండల మధ్య ఈ గ్రామం ఉండడంతో వేగంగా చీకటి పడిపోతుంది. సాయంత్రం వెలుగన్నదే కనిపించదు. తూర్పున గొల్లగుట్ట, పడమరన రంగనాయకుల గుట్ట, ఉత్తరాన నంబులాద్రి గుట్ట, దక్షిణాన పాంబండ గుట్టలు ఉన్నాయి. తూర్పున ఉన్న గొల్లగుట్ట… గ్రామానికి అడ్డుగా ఉండటంతో ఇక్కడ కొంచెం ఆలస్యంగా సూర్యోదయం అవుతుంది. ఇక.. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో సూర్యుడు… గ్రామ పడమర దిక్కున ఉన్న రంగనాయకుల గుట్ట వెనక్కి వెళ్తాడు. దీంతో ఈ గ్రామాన్ని చీకటి అలుముకుంటుంది. ఇక ఆ సమయానికి ప్రతి ఇంట్లో దీపాలు వెలుగుతాయి.

No rain village : వర్షం ప‌డ‌ని గ్రామం..! మేఘాలకు పైన ఉండే వింత ప్రాంతం..!

సాయంత్రమే తెలియని ఈ గ్రామస్తుల జీవన విధానంగా కూడా కొంచెం భిన్నంగానే ఉంటుంది. సాధారణంగా ఉదయం ఆలస్యంగా లేచే అలవాటు ఉన్నవారు ఎవరైనా ఈ ఊరికి వస్తే మాత్రం ఇంకా ఆలస్యంగా మేలుకోవాలి. ఎందుకంటే ఈ గ్రామంపై ఆలస్యంగా సూర్యుడి వెలుగు పడుతుంది. ఇక తెల్లారిందా పనులు త్వరత్వరగా పూర్తి చేసుకోవాలి. ఎందుకంటే త్వరగా చీకటి పడుతుంది కాబట్టి.

మరోవైపు ఇక్కడి నుండి ఇతర ప్రాంతాలకు పని కోసం వెళ్లిన వారు కూడా చీకటి భయంతో వీలైనంత త్వరగా ఊరికి వచ్చే ప్రయత్నం చేస్తుంటారు. చుట్టూ కొండలు, గుట్టల మధ్య ఉండే ఈ మూడు జాముల కొదురుపాక గ్రామం గురించి విన్న వారంతా ఆశ్చర్యానికి గురవుతుంటారు. సాయంత్రమే తెలియని గ్రామాన్ని చూసేందుకు పర్యాటకులు కూడా వస్తుంటారు.