Telangana Inter : ఈ స్టడీ మెటీరియల్ చదివితే ఇంటర్ పాస్!

ఉచిత స్టడీ మెటీరియల్ అందుబాటులోకి తీసుకొచ్చారు. స్టడీ మెటీరియల్ ను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం ఆవిష్కరించారు.

Telangana Inter : ఈ స్టడీ మెటీరియల్ చదివితే ఇంటర్ పాస్!

Inter

Intermediate Course : ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఇప్పటి నుంచే పుస్తకాలతో కుస్తీలు పడుతున్నారు. పరీక్షల్లో పాస్ కావాలని కష్టపడి చదువుతున్నారు. అయితే..వీరికి సౌకర్యార్థం ఉచిత స్టడీ మెటీరియల్ అందుబాటులోకి తీసుకొచ్చారు. స్టడీ మెటీరియల్ ను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం ఆవిష్కరించారు. ధైర్యంగా పరీక్షలు రాసేందుకు విద్యార్థులకు ఈ స్టడీ మెటీరియల్ ఒక కరదీపికగా ఉపయోగపడుతుందని, చరిత్ర, గణితం, జంతుశాస్త్రం, వృక్షశాస్త్రం, భౌతిక శాస్త్రాల సబ్జెక్స్ స్టడీ మెటీరియల్ www.tsbie.cgg.gov.inవెబ్ సైట్ లో అందుబాటులో ఉంటుందని తెలిపారు. మిగతా సబ్జెక్ట్ ల స్టడీ మెటీరియల్ త్వరలోనే అందుబాటులో ఉంటుందన్నారు. పరీక్షల్లో 50 శాతం చాయిస్ ప్రశ్నలు ఇస్తున్నట్లు ఇంటర్ బోర్డు కమిషనర్ జలీల్ తెలిపారు. సెకండియర్ లో ఉన్న విద్యార్థులకు ఈ నెలలోనే ఫస్టియర్ పరీక్షలను నిర్వహించనున్న సంగతి తెలిసిందే.

Read More : Biological E: ‘కరోనా వ్యాక్సిన్ మూడో డోసు ప్రయోగాలకు అనుమతి కావాలి’

ప్రశ్నల వివరాలు

అర్ధశాస్త్రం, రాజనీతిశాస్త్రం రెండింటిలో A సెక్షన్‌లో 10, B సెక్షన్‌లో 5, C సెక్షన్‌లో 2 మార్కుల ప్రశ్నలివ్వడం జరుగుతుంది. A సెక్షన్‌లో 6 ప్రశ్నలకు 3, B సెక్షన్‌లో 16 ప్రశ్నలకు 8, C సెక్షన్‌లో 30 ప్రశ్నలకు 15 ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది.

గణితంలో A, B, C మూడు సెక్షన్లు ఉంటాయి. A సెక్షన్‌లో 2 మార్కులు, B సెక్షన్‌లో 4, C సెక్షన్‌లో 7 మార్కుల ప్రశ్నలుంటాయి. A సెక్షన్‌లో 10 ప్రశ్నలకు, B సెక్షన్‌లో 10 ప్రశ్నలకు 5, C సెక్షన్‌లో 10 ప్రశ్నలకు ఐదింటికి సమాధానాలు రాయాల్సి ఉంటుంది.

Read More : Chhattisgarh : బొగ్గు తవ్వకాలను నిరసిస్తూ…300 కి.మీ పాదయాత్ర

రసాయనశాస్త్రంలో సెక్షన్‌ Aలో ఒక్కో ప్రశ్నకు 2 మార్కులు, సెక్షన్‌ Bలో 4, సెక్షన్‌ Cలో 8 మార్కుల ప్రశ్నలకు సమాధానం రాయాల్సి ఉంటుంది. సెక్షన్‌ Aలో 10 ప్రశ్నలకు మొత్తం రాయాలి. సెక్షన్‌ B లో 12 ప్రశ్నలకు 6, సెక్షన్‌ Cలో 4 ప్రశ్నలకు రెండింటికి సమాధానాలు రాయాలి.

భౌతికశాస్త్రంలో A సెక్షన్‌లో 2, B సెక్షన్‌లో 4, C సెక్షన్‌లో 8 మార్కుల ప్రశ్నలిస్తారు. సెక్షన్‌ Aలో పది ప్రశ్నలిస్తారు. అన్నింటికీ సమాధానం రాయాలి. B సెక్షన్‌లో 12 ప్రశ్నల్లో ఆరింటికి, సెక్షన్‌ Cలో 4 ప్రశ్నలకు రెండింటికి సమాధానాలివ్వాలి.

Read More : Domestic Flights : దేశీయ విమానాలపై ఆంక్షలు ఎత్తివేత.. పూర్తిస్థాయి సీటింగ్ కు అనుమతి

బోటనీ A సెక్షన్‌లో 2 మార్కులు, B సెక్షన్‌లో 4 మార్కులు, C సెక్షన్‌లో 8 మార్కుల ప్రశ్నలిస్తారు. A సెక్షన్‌లో 10 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. B సెక్షన్‌లో 12 ప్రశ్నలకు 6, C సెక్షన్‌లో 4 ప్రశ్నల్లో రెండింటికి సమాధానాలివ్వాలి.