Sunday-Funday : మరింత వినోదం, ఈ సండే దాండియా, గార్బా

కలర్ ఫుల్ పూలతో ట్యాంక్ బండ్ కు సరికొత్త అందం తీసుకొచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. దాండియా, గార్బా వేడుకలను నిర్వహించనున్నారు.

10TV Telugu News

Sunday Tank Bund : నగరానికి మణిహారంగా ఉన్న ట్యాంక్ బండ్ పై మంత్రి కేటీఆర్ సూచనతో ప్రారంభమైన ‘సండే ఫన్ డే ఫుల్ జోష్ లో కొనసాగుతోంది. ప్రతి ఆదివారం నిర్వహించబడే ట్యాంక్ బండ్ వాహన రాకపోకలను నిషేధిస్తారనే సంగతి తెలిసిందే. దీంతో చిన్నా..పెద్ద అనే తేడా లేకుండా..ట్యాంక్ బండ్ కు పోటెత్తుతున్నారు. ప్రజల నుంచి భారీ స్పందన వస్తుండడంతో కార్యక్రమాల విషయాల్లో మార్పులు చేర్పులు చేస్తున్నారు అధికారులు. ఫుడ్ స్టాల్స్, హ్యాండాక్రాఫ్ట్ స్టాల్స్, లేజర్ షో, చిన్న పిల్లలకు ఆటలాడుకొనే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఫుడ్ స్టాల్స్, సంగీత కచేరీలు..ఇతర ప్రదర్శనలు నిర్వహిస్తుండడంతో ట్యాంక్ బండ్ ప్రజలతో కిక్కిరిసిపోతోంది.

Read More : Madhav Sheth : రియల్ మీ ఇండియా…బంపర్ ఆఫర్, ఆఫ్ లైన్ స్టోర్లు

తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా ప్రతి వారం సండే – ఫన్ డే నిర్వహిస్తున్నారు. దసరా పండుగ సందర్భంగా..మరింత జోష్ తీసుకొచ్చే విధంగా…మరిన్ని కార్యక్రమాలను నిర్వహించాలని తలపెట్టారు. ఈ వారం కలర్ ఫుల్ పూలతో ట్యాంక్ బండ్ కు సరికొత్త అందం తీసుకొచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. బతుకమ్మ వేడుకలతో పాటు…దాండియా, గార్బా వేడుకలను నిర్వహించడం జరుగుతుందని అర్బన్ డెవలప్ మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. హ్యాండ్లూమ్‌, హ్యాండిక్రాఫ్ట్ స్టాల్స్, లేజర్ షోను నిర్వహించనున్నారు. ప్రేక్షకులు కూర్చొడానికి ట్యాంక్ బండ్ చుట్టూ..పలు ఏర్పాట్లు చేసింది.

Read More : Pawan Kalyan: ఎన్ని అరుపులు అరిచినా.. వైసీపీ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ చురకలు

కొద్ది రోజుల క్రితం ఓ సిటిజన్ మంత్రి కేటీఆర్ ను ట్యాగ్ చేస్తూ ట్యాంక్ బండ్ ట్రాఫిక్ గురించి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పై స్పందించిన ఐటీ మంత్రి కేటీఆర్.. ట్రాఫిక్ విషయమై నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ని ట్యాగ్ చేసి ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలోనే ట్రాఫిక్ మళ్లించేందుకు ఏర్పాటు చేయాలని తెలిపారు. మంత్రి ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ప్రతి ఆదివారం సాయంత్రం 5 నుంచి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి. ప్రజల నుంచి ఫుల్ రెస్పాండ్ రావడంతో…ట్రాఫిక్ ఆంక్షల సమయంలో మార్పులు చేశారు. మధ్యాహ్నం 03 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్యాంక్ బండ్ పై వాహన రాకపోకలపై నిషేధం విధించారు.

×