Tank Bund : సండే ఫన్ డే ఈ ఆదివారం ఉండదు

డిసెంబర్ 05వ తేదీన ట్యాక్ బండ్ పై వాహనదారులకు ఎలాంటి ట్రాఫిక్ ఆంక్షలు ఉండవని తెలిపారు.

Tank Bund : సండే ఫన్ డే ఈ ఆదివారం ఉండదు

Funday

Sunday-Funday : ట్యాంక్ బండ్ పై మంత్రి కేటీఆర్ సూచనతో ప్రారంభమైన ‘సండే ఫన్ డే’ కార్యక్రమం వాయిదా పడుతుంటే..ప్రజలు తీవ్ర నిరుత్సాహానికి గురవుతున్నారు. ఎంతో ఆహ్లాదంగా..ఆనందంగా..కొన్ని గంటల పాటు హుస్సేన్ సాగర్ పై ఇంటిల్లిపాది ఫుల్ ఎంజాయ్ చేస్తుంటారు. ప్రతి ఆదివారం సండే ఫన్ డే కార్యక్రమం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ట్యాంక్ బండ్ పై వాహనాలను అనుమతించరు. ఇలాంటి కార్యక్రమం చార్మినార్ వద్ద కూడా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

Read More : Cyberabad Police : దేశంలోనే భారీ సైబ‌ర్ క్రైమ్.. ముఠా గుట్టురట్టు.. 14మంది అరెస్ట్!

అయితే..కొన్ని కారణాలు సండే ఫన్ డే కార్యక్రమానికి అడ్డంకి తగులుతున్నాయి. తాజాగా…ఒమిక్రాన్ వైరస్ ప్రపంచాన్ని భయపెడుతోంది. పలు దేశాల్లో వైరస్ కేసులు వెలుగు చూస్తున్నాయి. దీంతో భారతదేశ కూడా అలర్ట్ అయ్యింది. పలు నిబంధనలు, ఆంక్షలు విధిస్తోంది. ఎయిర్ పోర్టులోనే పరీక్షలు నిర్వహిస్తున్నారు. విదేశీయులు నిబంధనలు పాటించాల్సి ఉంటుందని సూచిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా పలు చర్యలు తీసుకొంటోంది. విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చే ప్రయణీకులపై ఆంక్షలు విధించింది. ప్రజలు గుమికూడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు సూచిస్తున్నారు. ఈ క్రమంలో.. సండే ఫన్ డే నిర్వహిస్తే..ప్రమాదం ఏర్పడుతుందని అధికారులు భావించారు. ఈ విషయాన్ని మున్సిపల్ పరిపాలన ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ ప్రకటించారు. డిసెంబర్ 05వ తేదీన ట్యాక్ బండ్ పై వాహనదారులకు ఎలాంటి ట్రాఫిక్ ఆంక్షలు ఉండవని తెలిపారు.

Read More : Ghat Roads : టీటీడీ ముందుచూపు, ఘాట్ రోడ్ల మధ్య లింక్ రోడ్డు

ఒమిక్రాన్ వైరస్ పై 2021, డిసెంబర్ 2వ తేదీ గురువారం తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు మీడియా సమావేశం నిర్వహించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని డీహెచ్ హెచ్చరించారు. భారత్‌కు ఒమిక్రాన్ ముప్పు ఎప్పుడైనా రావొచ్చన్నారు. ముప్పు నుంచి తప్పించుకోవాలంటే కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించాలన్నారు. ఒమిక్రాన్ పై సిఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు ఆదేశాలిస్తున్నారని డీహెచ్ తెలిపారు. క్రమంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని…రాబోయే రెండు నెలలు అత్యంత కీలకమని అన్నారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మాస్క్ ధరించకపోతే వెయ్యి రూపాయలు జరిమానా నిబంధనను కచ్చితంగా పాటిస్తామన్నారు.