TPCC : టీపీసీసీ మహిళా అధ్యక్షురాలిగా సునీతారావు

తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలి ఎన్నిక విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పదవికి సునీతా రావును నియమిస్తూ..ఈ మేరకు సోనియా గాంధీ ఆదేశాలు జారీ చేశారు.

TPCC : టీపీసీసీ మహిళా అధ్యక్షురాలిగా సునీతారావు

Tpcc Women

TPCC Women Congress President : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ బాధ్యుల నియామకానికి ఎట్టకేలకు కాంగ్రెస్ హై కమాండ్ శ్రీకారం చుట్టింది. అయితే..టీపీసీసీ చీఫ్ ఎంపికపై మాత్రం సస్పెన్స్ కొనసాగుతోంది. తమకు ఈ పదవి కేటాయించాలంటూ పలువురు సీనియర్లు పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. దీనిని పక్కన పెట్టిన హై కమాండ్..తాజాగా..తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలి ఎన్నిక విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పదవికి సునీతా రావును నియమిస్తూ..ఈ మేరకు సోనియా గాంధీ ఆదేశాలు జారీ చేశారు.

ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నేరేళ్ల శారద ఉన్నారు. టీపీసీసీ అధ్యక్షుడిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ఇప్పటికే ఎంపిక చేశారని ఓ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే..సీనియర్ల అసంతృప్తుల వల్లే పీసీసీ ప్రకటన ఆగిపోయిందనే అనుమానాలు కలుగుతున్నాయి.