YS Viveka Case : తెలంగాణ హైకోర్టుకు క్షమాపణలు చెప్పిన సునీతా రెడ్డి

వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంపై శనివారం తెలంగాణ హైకోర్టులో విచారణ సందర్భంగా సీబీఐ తమ వాదనలు వినిపించింది. సీబీఐ తరఫున వాదిస్తున్న ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ అనిల్ తమ వాదనలు వినిపించారు.

YS Viveka Case : తెలంగాణ హైకోర్టుకు క్షమాపణలు చెప్పిన సునీతా రెడ్డి

YS Sunitha

YS Viveka Case – TS High Court : మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు కీలక మలుపులు తిరుగుతుంది. హత్యకేసును విచారిస్తున్న సీబీఐ అధికారులు అవినాశ్ రెడ్డిని మరోసారి విచారించేందుకు ఇటీవల పలుసార్లు నోటీసులు పంపించారు. అయినా అవినాశ్ రెడ్డి పలు కారణాలతో విచారణకు రాలేనని చెప్పారు. అవినాశ్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేస్తుందన్న వార్తల నేపథ్యంలో తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటీషన్ దాఖలు చేశారు.

YS Viveka Case : వైఎస్ వివేకా కేసులో సీఎం జగన్ పేరు.. సీబీఐ సంచలనం

అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటీషన్‌పై విచారణ సమయంలో.. ఆయన లాయర్ శుక్రవారం హైకోర్టులో తమ వాదనలు వినిపించారు. సుమారు 6 గంటల పాటు సుదీర్ఘంగా వాదనలు వినిపించారు. అవినాశ్‌ను కావాలనే సీబీఐ ఇరికిస్తోందని కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో అవినాశ్ రెడ్డి తరపు లాయర్లు, వైఎస్ సునీత న్యాయవాదుల మధ్య వాదోపవాదనలు జరిగాయి. ఈ సమయంలో అందరి వాదనలు ఇవాళే వింటామని న్యాయమూర్తి తెలిపారు. మధ్యలో కలుగజేసుకున్న సునీతా రెడ్డి.. తమ వాదనలు వినిపించేందుకు కూడా అంతే సమయం ఇవ్వాలని కోర్టుకు విజ్ఞప్తి చేసింది. దీంతో సునీతా రెడ్డిపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. లిమిట్స్‌లో ఉండాలంటూ కోర్టు సీరియస్ అయింది. అయితే, శనివారం హైకోర్టులో అవినాశ్ రెడ్డి పిటిషన్‌పై విచారణ ప్రారంభమైంది. దీంతో శుక్రవారం హైకోర్టులో జరిగిన ఘటనకు సునీతా రెడ్డి కోర్టుకు క్షమాపణలు చెప్పారు.

YS Viveka Case : ఎర్ర గంగిరెడ్డికి సుప్రీంకోర్టులో షాక్ .. హైకోర్టు తీర్పుపై స్టే

మరోవైపు, వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ సందర్భంగా శనివారం తెలంగాణ హైకోర్టులో సీబీఐ తమ వాదనలు వినిపించింది. సీబీఐ తరఫున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ అనిల్ తమ వాదనలు వినిపించారు. కేసు దర్యాప్తులో మొదటి నుంచి ఆటంకాలు సృష్టిసున్నారని కోర్టుకు తెలిపారు. దర్యాప్తు మా పద్ధతి ప్రకారం చేస్తాం కానీ, అవినాశ్ కోరుకున్నట్లు కాదని సీబీఐ కోర్టుకు తెలిపింది. అవినాశ్ విచారణకు సహకరించడం లేదని, దర్యాప్తు జాప్యం చేసి లబ్ధి పొందాలని చూస్తున్నారని సీబీఐ పేర్కొంది. నోటీసు ఇచినప్పుడల్లా ఏదో ఒక కారణం చెప్పి హాజరు కావడం లేదని, ఎంతో మందిని విచారించాం, కొందరిని అరెస్ట్ చేశాం.. మిగతా వారికి లేని ప్రత్యేకత పరిస్థితి అవినాశ్‌కు ఏమిటని సీబీఐ ప్రశ్నించింది.