తెలంగాణ ఎయిమ్స్‌లో రూ.10లకే అత్యాధునిక వైద్యం

  • Published By: sreehari ,Published On : November 5, 2020 / 08:40 AM IST
తెలంగాణ ఎయిమ్స్‌లో రూ.10లకే అత్యాధునిక వైద్యం

BB Nagar AIIMS : బీబీనగర్‌ ఎయిమ్స్‌లో రూ.10కే అత్యాధునిక వైద్యం అందించనున్నారు. దేశంలోని టాప్‌–10 ఎయిమ్స్‌లలో ఒకటిగా తీర్చిదిద్దుతామని ఓపీ సేవలు కూడా ప్రారంభమయ్యాయి.

2024 నాటికి అత్యాధునిక సూపర్‌ స్పెషాలిటీ వైద్యం అందుబాటులోకి వస్తుందని ఎయిమ్స్ డైరెక్టర్ వికాస్ భాటియా తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశా ప్రజలకు వైద్యం అందించినట్టు చెప్పారు. ఎయిమ్స్‌ కోసం సుమారు రూ.1,000 కోట్ల నిధులను కేంద్రం మంజూరు చేసిందని వెల్లడించారు.



జనరల్‌ మెడిసిన్, ఆర్థోపెడిక్, ఆప్తమాలజీ, గైనిక్, ఫ్యామిలీ మెడిసిన్, పీడియాట్రిక్‌ సేవలు అందించనుంది. డిసెంబర్‌ ఆఖరులో 100 పడకల ఇన్‌పేషెంట్‌ విభాగాన్ని ప్రారంభించాల్సి ఉండగా, కోవిడ్‌ నేపథ్యంలో 40 పడకలకే పరిమితం చేస్తున్నామన్నారు.



https://10tv.in/dharani-services-starting-telangana/
కరోనా పాజిటివ్‌ కేసుల కోసం 10 పడకలతో ఐసీయూ ఏర్పాటు చేస్తామని భాటియా తెలిపారు. తెలంగాణ ఎయిమ్స్‌లో పనిచేసేందుకు దేశంలోని ప్రముఖ డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది పోటీ పడుతున్నారు.



483 మంది ప్రొఫెసర్ల ఉద్యోగాల కోసం 2 వేల మంది దరఖాస్తు చేసుకున్నారని భాటియా చెప్పారు. ఇప్పటి వరకు 22 మంది డాక్టర్ల నియామకం పూర్తి అయింది.

మరికొంత మంది డాక్టర్ల నియామకం త్వరలో పూర్తి చేయనున్నారు. 2024 నాటికి 750 పడకలతో పూర్తి స్థాయి సూపర్‌ స్పెషాలిటీ వైద్యం అందుబాటులోకి రానుంది.