Supreme Court Green Signal : పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్ట్ పనులకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్

పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్ట్ నిర్మాణం పనులకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రాజెక్ట్ లో పర్యావరణ అనుమతుల మేరకు 7.15 టీఎంసీల వరకు పని కొనసాగించుకునేందుకు అనుమతి ఇచ్చింది.

Supreme Court Green Signal : పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్ట్ పనులకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్

Supreme Court

Supreme Court Green Signal : పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్ట్ నిర్మాణం పనులకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రాజెక్ట్ లో పర్యావరణ అనుమతుల మేరకు 7.15 టీఎంసీల వరకు పని కొనసాగించుకునేందుకు అనుమతి ఇచ్చింది. అలాగే ప్రాజెక్ట్ పనుల్లో పర్యావరణానికి జరిగిన నష్టానికి పరిహారం కింద నేషనల్ గ్రీన్ టెమినల్ తెలంగాణ సర్కార్ కు విధించిన 528 కోట్ల రూపాయలు అలాగే తమ ఆదేశాలను ఉద్ధేశపూర్వకంగా ఉల్లంఘించినందున విధించిన 300 కోట్ల రూపాయల ఫైన్ పై స్టే విధించింది.

పర్యావరణ అనుమతులు తీసుకోకుండానే పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోత పనులు చేస్తున్నారంటూ కడపకు చెందిన చంద్రమౌళీశ్వర్ రెడ్డి, పలువురు రైతులు గతంలో ఎన్జీటీలో పిటిషన్ దాఖలు చేశారు. వీరిపై విచారణ జరిపిన ఎన్జీటీ.. ప్రాజెక్ట్ పనులు నిలిపివేయాలని 2021 లో ఆదేశాలు ఇచ్చింది. అయితే తెలంగాణ సర్కార్ తమ ఆదేశాలు పాటించకుండా నిర్మాణం చేపడుతుందని 2022 డిసెంబర్ లో పరిహారంతో పాటు ఫైన్ వేసింది. ఈ ఆర్డర్ ను సవాల్ చేస్తూ తెలంగాణ సర్కార్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

Minister Harish Rao : గోదావరి నీళ్లను మంజీరాకు మళ్లించిన చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వానిది : మంత్రి హరీశ్ రావు

తొలుత తెంగాణ ప్రభుత్వం తరుపున సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్ కు వాదనలను వినిపించారు. ఎన్జీటీ ఆదేశాలతో రాష్ట్ర ప్రయోజానాలకు తీవ్రమైన నష్టం జరిగిందన్నారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్ట్ పూర్తిగా తాగు నీటి కోసం నిర్మిస్తోందని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణంతో రాయలసీమలో ఎలాంటి పర్యావరణానికి విఘాతం కలగటం లేదన్నారు. జాయింట్ కమిటీలో రెండు రాష్ట్రాలకు చెందిన అధికారులు ఉన్నారని ఏపీ తరపున సీనియర్ అడ్వకేట్ జయదీప్ గుప్తా వాదనలను కొనసాగించారు.

తాగునీటి అవరసరాలకు కేవలం 7.15 టీఎంసీలు సరిపోతాయని అయితే డ్రింకింగ్ ఎడికేషన్ ఇండ్రస్టీస్ అవసరాలకు తగ్గట్టుగా దాదాపు 90 టీఎంసీలకు తెలంగాణ డిజైన్ చేసిందన్నారు. ఈ మొత్తం పరిమాణంలో తాగునీటికి కేవలం తక్కువ కేటాయింపులు చేసినట్టు పేర్కొన్నారు. తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్ట్ పనులు ఆపాలని తాము కోరుతున్నామన్నారు. అయితే ఇరువైపులా సుదీర్ఘ వాదనలను విన్న ధర్మాసనం ఈ కేసులో తదుపరి విచారణ ఆగస్టుకు వాయిదా వేసింది. అప్పటి వరకు 7.15 టీఎంసీ నిర్మాణం పనులు చేసుకోవచ్చని స్పష్టం చేసింది.