Fined For Ox Urinates : ఇదేందయ్యా ఇది.. ఆఫీసు ముందు ఎద్దు మూత్రవిసర్జన చేసిందని రైతుకి జరిమానా

Fined For Ox Urinates : ఇదేందయ్యా ఇది.. ఆఫీసు ముందు ఎద్దు మూత్రవిసర్జన చేసిందని రైతుకి జరిమానా

Fined For Ox Urinates : ఈరోజుల్లో మనుషులే ఎక్కడ పడితే అక్కడ మూత్ర విసర్జన చేస్తూ పరిసరాలను అపరిశుభ్రం చేస్తున్నా పట్టించుకునే వారు లేరు. అలాంటిది ఓ మూగజీవి మూత్ర విసర్జన చేస్తే.. అందుకు జరిమానా విధించడం ఏంటిని షాక్ అయ్యారు కదూ.

అవును, ఆఫీసు ముందు ఎద్దు మూత్ర విసర్జన చేసిందని రైతుకు కోర్టు జరిమానా విధించిన వింత ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది. అసలేం జరిగింది అనే వివరాల్లోకి వెళితే.. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్ సీసీఎల్) కార్యాలయం ముందు ఓ ఎద్దు మూత్ర విసర్జన చేసిందని దాని రైతుకు జరిమానా విధించారు.

Also Read..Devotee Stuck Under Statue : అయ్యో భయ్యా.. అక్కడేం పని నీకు.. గుడిలో విగ్రహం కిందకి వెళ్లి ఇరుక్కుపోయిన భక్తుడు.. వీడియో వైరల్

తన నుంచి తీసుకున్న భూమికి సింగరేణి కంపెనీ పరిహారం చెల్లించేందుకు నిరాకరిస్తోందంటూ సుందర్ లాల్ అనే రైతు తన కుటుంబంతో సహా కంపెనీ కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన చేపట్టాడు. ఈ నిరసనలో అతడు తన ఎద్దుల బండితో పాటు పాల్గొన్నాడు. ఆ జోడెద్దుల్లో ఒకటి సింగరేణి కార్యాలయం గేటు ఎదుట మూత్రం పోసింది. దాంతో సింగరేణి అధికారులు ఇల్లెందు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుందర్ లాల్, అతడి కుటుంబం తమ కార్యాలయం ఎదుట రభస సృష్టిస్తున్నారని, ఎద్దులతో మూత్రం పోయించి అపరిశుభ్రంగా మార్చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. రైతును పోలీసులు కోర్టులో హాజరుపర్చగా, ఆ రైతుకు రూ.100 జరిమానా విధించారు.

అధికారుల తీరును రైతు, అతడి కుటుంబం ఖండించింది. ఎద్దుతో తాను మూత్రం పోయించలేదని రైతు స్పష్టం చేశాడు. ప్రజలు మూత్ర విసర్జన చేస్తుంటేనే దిక్కు లేదని, ఎవరికీ జరిమానా విధించరు కానీ, ఇక్కడ ఎద్దు మూత్రం పోసిందని జరిమానా విధించడం ఏంటని వారు తప్పుపట్టారు.

Boring Job : వీడెవడండీ బాబూ.. నెలకు రూ.8లక్షల జీతం.. అయినా జాబ్ బోరింగ్‌గా ఉందని కంపెనీపై కేసు

దీనిపై సింగరేణి అధికారులు వివరణ ఇచ్చారు. కోర్టులో రైతు పిటిషన్ తిరస్కరణకు గురైందని, అయినప్పటికీ అతడు తమ కార్యాలయం ముందు ఇబ్బందికర వాతావరణం సృష్టిస్తున్నాడని వారు ఆరోపించారు. మొత్తంగా.. ఎద్దు మూత్ర విసర్జన చేసిందని దాని రైతుకు ఫైన్ వేయడం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. ఇదెక్కడి విడ్డూరం రా నాయనా అని ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.