మరో వారం ఇలానే ఉంటే కుటుంబాలు గడవని పరిస్థితి ఖాయం

  • Published By: Subhan ,Published On : May 13, 2020 / 04:36 AM IST
మరో వారం ఇలానే ఉంటే కుటుంబాలు గడవని పరిస్థితి ఖాయం

ఇండియన్ ఎకానమీ హౌస్ హోల్డ్ నిర్వహించిన సర్వేలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. లాక్‌డౌన్ కారణంగా ఇళ్లలోనే ఉండిపోయిన మూడో వంతు ఇండియన్లకు వనరులు కరువవుతాయని ఫలితంగా ఒత్తిడికి గురవుతారని చెప్పింది. హౌజ్ హోల్డ్ ఆధాయంపై నిర్వహించిన సర్వేను మంగళవారం బయటపెట్టింది. లాక్‌డౌన్ ప్రభావంతో నెలవారీ ఆదాయం తగ్గిపోవడమే కాక, నిరుద్యోగ శాతం కూడా మూడు రెట్లు పెరిగి 25.5శాతానికి చేరుకుంది.

దేశవ్యాప్తంగా 34 శాతం మంది కుటుంబీకులు అదనపు సహాయం లేకుండా ఇంకొక వారానికి మించి మెయింటైన్ చేయాలని సర్వే చెప్తుంది. సీఎమ్ఐఈ చీఫ్ ఎకానమిస్ట్ కౌశిక్ కృష్ణన్ కుటుంబీకులకు అత్యవసరంగా సహాయం చేయాల్సి ఉందని అంటున్నారు. రేషన్ ఇవ్వడం లేదా నేరుగా నగదు ఇవ్వడం లాంటివి జరిపితే ఈ కొరత నుంచి అధిగమించవచ్చు. 

కుటుంబ ఆధాయం పడిపోవడం నిరుద్యోగం పెరగడం రెండింటికి సంబంధాలు ఉన్నాయి. మార్చి 21నుంచి మే 5వరకూ ఇది 7.4శాతం పెరిగింది. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఎకానమీ (సీఎమ్ఐఈ) 20-30 సంవత్సరాల మధ్య వయస్సున్న 27మిలియన్ మంది ఉద్యోగాలు పోగొట్టుకున్నారని చెప్పింది. 

నిరుద్యోగ శాతం పెరగకుండా ఉండేందుకు ప్రభుత్వ ఇండస్ట్రీలను ఓపెన్ చేయించింది. సీఎమ్ఐఈ డేటా ప్రకారం.. 20-24ఏళ్ల వయస్సున్న వారిలో 11శాతం మంది ఉద్యోగాలు కోల్పోయారు. 

Read Here>> భారత్ ను రక్షిస్తాయా ? మోడీ చెప్పిన 5 పిల్లర్లేంటీ