Bike Theft : పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన గజదొంగ.. ఎట్టకేలకు దొరికాడు

గత కొంతకాలంగా సూర్యాపేట, ఖమ్మం జిల్లాలలోని పలు పోలీస్ స్టేషన్లలో బైక్ చోరీ ఫిర్యాదులు అధికంగా వస్తున్నాయి. గడిచిన రెండు మూడు నెలల్లో సుమారు 30 మంది తమ బైక్ ను ఎవరో దొంగిలించినట్లుగా ఫిర్యాదు చేశారు. బైక్ ల దొంగతనాలు సూర్యాపేట, కోదాడ, ఖమ్మం పోలీసులకు తలనొప్పిగా మారింది.

Bike Theft : పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన గజదొంగ.. ఎట్టకేలకు దొరికాడు

Bike Theft

Bike Theft : గత కొంతకాలంగా సూర్యాపేట, ఖమ్మం జిల్లాలలోని పలు పోలీస్ స్టేషన్లలో బైక్ చోరీ ఫిర్యాదులు అధికంగా వస్తున్నాయి. గడిచిన రెండు మూడు నెలల్లో సుమారు 30 మంది తమ బైక్ ను ఎవరో దొంగిలించినట్లుగా ఫిర్యాదు చేశారు. బైక్ ల దొంగతనాలు సూర్యాపేట, కోదాడ, ఖమ్మం పోలీసులకు తలనొప్పిగా మారింది.

ఈ నేపథ్యంలోనే నిఘా పెంచారు పోలీసులు. గత నాలుగు రోజులుగా పోలీసులు కోదాడలోని ఖమ్మం క్రాస్ రోడ్డులో తనిఖీలు ముమ్మరం చేశారు. బైక్ తనిఖీలు చేస్తున్న పోలీసులకు సరైన పత్రాలు లేని బైక్ పై ఓ వ్యక్తి వచ్చాడు. దీంతో అతడిని అదుపులోకి తీసుకోని విచారించడంతో విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం రురల్ మండలం తల్లంపాడు గ్రామానికి చెందిన ప్రభాస్‌ అలియాస్‌ ప్రభాకర్‌ అనే వ్యక్తి చికెన్ షాట్ నిర్వహిస్తుంటాడు. ఇదే సమయంలో తనకు పరిచయమైన వారిలో డబ్బు అవసరం ఉన్నవారిని గుర్తించి ఓ గ్యాంగ్ ను ఏర్పాటు చేశాడు. చికెన్ షాప్ లో ఉంటూనే గ్యాంగ్ లోని కొందరితో బైక్ చోరీలు చేయించేవాడు.. మరికొందరు వాటిని అమ్మిపెట్టేవారు. ఆలా నాలుగేళ్లుగా ఈ దందా కొనసాగిస్తున్నారు.

8 మంది సభ్యులు గల ఈ ముఠా, సూర్యాపేట, కోదాడ, ఖమ్మం ప్రాంతాల్లో 200లకు పైగా బైక్ లను దొంగతనం చేసి తక్కువ రేటుకు అమ్మేసింది. కొత్త బైక్ లు, మంచి ధర వచ్చే బైక్ లను గమనించి వాటిని తస్కరిస్తారు. ఇక వీరిదగ్గర స్పెషల్ గా తయారు చేయించుకున్న తాళం ఉండటంతో ఎలాంటి బండినైనా దొంగతనం చేసి తీసుకుపోతారు. దొంగతనం చేసే సమయంలో ఎవరు గుర్తించకుండా హెల్ మెంట్ పెట్టుకునేవారు.

బైక్ దొంగిలించిన కొద్దీ గంటలోనే దాని రూపు రేకలు మార్చేసి అమ్మేసేవారు. ఆలా వచ్చిన సొమ్ములో కొంత మిగతా టీం సభ్యులకు ఇవ్వగా మిగిలింది ప్రభాస్ తీసుకునేవాడు. కాగా పలు వ్యాపారాలు చేసి నష్టపోయిన ప్రభాస్ ఈజీగా డబ్బు సంబదించాలని పథకం వేసి దొంగతనాలకు మళ్ళాడు. చివరకు పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు. అయితే ఇక వీరి నుంచి 30కి పైగా బైక్ లను స్వాధీనం చేసుకున్నారు.