Suryapeta : రాష్ట్రంలోనే సూర్యాపేట జిల్లాలో అత్యధిక వర్షపాతం

సూర్యాపేట జిల్లాలో కేంద్రంతో పాటు పరిసర ప్రాంతాల్లో అర్థరాత్రి నుంచి ఉదయం వరకు భారీ వర్షం కురిసింది. దీంతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి.

Suryapeta : రాష్ట్రంలోనే సూర్యాపేట జిల్లాలో అత్యధిక వర్షపాతం

Suryapeta

Suryapeta highest rainfall : ఉమ్మడి నల్గొండ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో ముసురు పట్టింది. నల్లగొండ, సూర్యాపేట, నార్కట్ పల్లి, నూతనకల్, కట్టంగూర్, ఆత్మకూరు, కేతేపల్లి తదితర మండలాల్లో కురిసిన వర్షాలకు చెరువులు, కుంటల్లోకి వరద నీరు వచ్చి చేరింది. పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.

పలు చోట్ల ఇళ్లలోకి నీరు వచ్చింది. రాష్ట్రంలోనే సూర్యాపేట జిల్లాలో అత్యధిక వర్షపాతం కురిసింది. సూర్యాపేట జిల్లాలోని ఎర్కకారంలో అత్యధికంగా 14.5 సెంటిమీటర్ల వర్షం కురిసింది. నల్లగొండలోని అయిటిపాములలో 11.5 సెంటిమీటర్లు, కట్టంగూర్‌లో 11.1 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది.

Test Captain : బీసీసీఐకి కొత్త సవాల్‌.. కోహ్లీ స్థానంలో ఎవరు..?

సూర్యాపేట జిల్లాలో కేంద్రంతో పాటు పరిసర ప్రాంతాల్లో అర్థరాత్రి నుంచి ఉదయం వరకు భారీ వర్షం కురిసింది. దీంతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. నకిరేకల్ మండల వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి తాటికల్ గ్రామ శివారులో వాగు ఉప్పొంగుతోంది. దీంతో నల్లగొండ – నకిరేకల్ మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అటు వరదల్లో చిక్కుకున్న ఎనిమిది మంది కూలీలను స్థానికుల కాపాడారు.

మరోవైపు కట్టంగూర్ పెద్ద చెరువు నిండు కుండలా మారింది. ఇంకా చాలా చెరువులు కూడా నిండే అవకాశాలు కనిపిస్తున్నాయి. సూర్యాపేటలో అత్యధికంగా 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవగా.. నకరేకల్‌లో 12 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి జగదీష్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ కమిషనర్, ఇరిగేషన్, రెవిన్యూ అధికారులతో ఆయన పరిస్థితులను సమీక్షించారు.