Doctor Swetha Suspicious Death : అసలేం జరిగింది? డాక్టర్ శ్వేత మృతిపై తల్లిదండ్రుల అనుమానం | Suspicious Death, Parents Raise Doubts On PG Medical Student Doctor Swetha Death

Doctor Swetha Suspicious Death : అసలేం జరిగింది? డాక్టర్ శ్వేత మృతిపై తల్లిదండ్రుల అనుమానం

శ్వేత రాత్రి 12 గంటల సమయంలో తమకు ఫోన్ చేసి మాట్లాడిందని, ఆ సమయంలో చాలా యాక్టివ్ గా ఉందంటున్నారు. తెల్లవారేసరికి చనిపోయిందని చెప్పారంటూ భోరున విలపిస్తున్నారు.(Doctor Swetha Suspicious Death)

Doctor Swetha Suspicious Death : అసలేం జరిగింది? డాక్టర్ శ్వేత మృతిపై తల్లిదండ్రుల అనుమానం

Doctor Swetha Suspicious Death : పీజీ స్టూడెంట్ డాక్టర్ శ్వేత మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఆమె తల్లిదండ్రులు కళావతి, శ్రీనివాస్ రావ్ లు. శ్వేత రాత్రి 12 గంటల సమయంలో తమకు ఫోన్ చేసి మాట్లాడిందని, ఆ సమయంలో చాలా యాక్టివ్ గా ఉందంటున్నారు. అయితే, తెల్లారేసరికి సడెన్ గా కాల్ చేసి చనిపోయిందని చెప్పారంటూ భోరున విలపిస్తున్నారు. అసలేం జరిగిందో డాక్టర్లు తమకు చెప్పడం లేదని మండిపడుతున్నారు. పైగా, తమ కొడుకు వచ్చే వరకు పోస్టుమార్టంకు అంగీకరించేది లేదని తేల్చి చెబుతున్నారు.

నిజామాబాద్ జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలో పీజీ స్టూడెంట్ డాక్టర్ శ్వేత అనుమానాస్పద స్థితిలో శుక్రవారం మరణించింది. గైనిక్ విభాగంలో పీజీ చేస్తున్న డాక్టర్ శ్వేత.. తన ట్రైనింగ్ లో భాగంగా నిన్న రాత్రి రెండు గంటల వరకూ డ్యూటీలోనే ఉంది. ఉదయం తను పడుకున్న గదిలోకి వెళ్లి చూసేసరికి విగతజీవిగా పడి ఉండటంతో ఒక్కసారిగా కలకలం రేగింది. శ్వేత గుండెపోటుతో మరణించి ఉండొచ్చని డాక్టర్లు అంచనా వేస్తున్నారు. అయితే శ్వేతది అనారోగ్యంతో సహజ మరణమా.. లేక, ఇంకేమైనా ఇబ్బందులుండేవా అనేది ఇప్పుడు మిస్టరీగా మారింది.(Doctor Swetha Suspicious Death)

Telangana : ఆస్పత్రిలోనే అనుమానాస్పదంగా మృతి చెందిన డాక్టర్ శ్వేత

కరీంనగర్ జిల్లాకు చెందిన డాక్టర్ శ్వేత నిజామాబాద్ జిల్లా కేంద్ర ఆసుపత్రిలో మెడికోగా విధులు నిర్వహిస్తోంది. గైనకాలజీ విభాగంలో పీజీ సెకండియర్ చదువుతోంది. కాగా, గతంలో రెండుస్లారు శ్వేతకు కరోనా సోకింది. కోవిడ్ నుండి కోలుకున్న తర్వాత చోటు చేసుకున్న ఆరోగ్య మార్పులతో ఆమెకు గుండెపోటు వచ్చిందా? అనే కోణంలో కూడా డాక్టర్లు అనుమానిస్తున్నారు.

శుక్రవారం తెల్లవారుజాము రెండు గంటల వరకు డాక్టర్ శ్వేత గైనకాలజీ విభాగంలో విధులు నిర్వహించింది. మూడు గంటల సమయంలో ఆసుపత్రిలోనే ఉన్న రెస్ట్ రూమ్ లో వెళ్లి పడుకుంది. ఉదయం తోటి సిబ్బంది చూసే సరికి శ్వేత మృతి చెందింది. దీంతో వారు షాక్ కి గురయ్యారు. తమతో కలిసి పని చేసే తోటి డాక్టర్ హఠాత్తుగా చనిపోయే సరికి ఇతర జూనియర్ డాక్టర్లు విషాదంలో మునిగిపోయారు. శ్వేతలో ఎప్పుడూ కూడా డిప్రెషన్ వంటిది చూడలేదని, చాలా చెలాకీగా ఉండేదని తోటి వైద్యులు అన్నారు. ఆమె మరణం చాలా బాధాకరమన్నారు. డాక్టర్ శ్వేత రాత్రి తన ఫ్రెండ్స్ కు జ్యూస్ పార్టీ కూడా ఇచ్చిందన్నారు.

Bride Srujana Postmortem : బలవంతం లేదు, ఎఫైర్ లేదు.. సృజన ఇష్టంతోనే పెళ్లి ఏర్పాట్లు

అంత యాక్టివ్ గా ఉన్న అమ్మాయి అలా చనిపోవటం చాలా బాధగా ఉందన్నారు. కాగా, తమ కూతురు ఎలా చనిపోయిందో చెప్పాలని శ్వేత పేరెంట్స్ డిమాండ్ చేశారు. అంతేకాదు, శ్వేత డెడ్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించడానికి వారు అంగీకరించడం లేదు. జార్ఖండ్ లో పోలీస్ శిక్షణలో ఉన్న డాక్టర్ శ్వేత సోదరుడు వచ్చిన తర్వాతే పోస్టుమార్టం నిర్వహించేందుకు అనుమతిస్తామని డాక్టర్ శ్వేత తల్లిదండ్రులు తేల్చి చెప్పారు.

×