నెహ్రూ జూపార్క్ లో చింపాజి (సుజీ) మృతి

  • Published By: madhu ,Published On : November 13, 2020 / 09:12 AM IST
నెహ్రూ జూపార్క్ లో చింపాజి (సుజీ) మృతి

Suzi, the most popular Chimpanzee dies : నెహ్రూ జూ పార్క్ లో సందర్శకులను ఆకట్టుకున్న చింపాజి (సుజీ) కన్నుమూసింది. గుండెపోటుతో చనిపోయిందని వైద్యులు పేర్కొన్నారు. జూలో ఉన్న చింపాజి 12వ తేదీ ఉదయం 8.30 గంటలకు చనిపోయిందని నెహ్రూ జూపార్క్ ఓ ప్రకటనలో వెల్లడించింది. పార్క్ లో సుజీ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ..ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసింది. సుజీకి సంబంధించిన ఫొటోలను షేర్ చేశారు.



1986 జులై 15న చింపాజి పుట్టింది. ప్రస్తుతం దీని వయస్సు 35 సంవత్సరాలు. 12వ తేదీ ఉదయం సుజీ నేలపై పడి ఉన్నట్లు సిబ్బంది గుర్తించారు. వెంటనే ఈ విషయాన్ని అధికారులకు తెలియచేశారు. వైద్య సిబ్బంది వచ్చి పరీక్షించగా చనిపోయిందని నిర్ధారించారు. గుండె, ఊపిరితిత్తులు మినహా అన్ని అవయవాలు బాగానే ఉన్నాయని, గుండెపోటుతో చనిపోయిందని వెల్లడించారు.



పండ్లు, మొలకలు, రసాలు, కొబ్బరి నీళ్లు, ఇతర ఆహారం ఎప్పటిలాగానే సుజీ తీసుకొందని వెల్లడిస్తున్నారు. ఇటీవలే దీని బర్త్ డే వేడుకలు ఘనంగా జరిపారు పార్క్ సిబ్బంది. సుజీ కోసం పండ్లు, రొట్టెలతో కూడిన ఫ్రూట్ కేక్ తయారు చేసి చింపాంజీకి అందించారు. చింపాజి సగటు జీవిత కాలం 39 సంవత్సరాలు.