Antibody Cocktail: ‘ఒక్కరోజులో కొవిడ్ లక్షణాలు మాయం’

డాక్టర్లు కోవిడ్ ట్రీట్మెంట్‌లో మరో గుడ్ న్యూస్ చెప్పారు. మోనోక్లోనల్ యాంటీబాడీస్ సింగిల్ డోస్ డ్రగ్ కాక్ టైల్ ఇవ్వగానే ఒక్కరోజులో లక్షణాలు దూరమయ్యాయని అంటున్నారు డాక్టర్లు. హైదరాబాద్ ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ హాస్పిటల్ ఛైర్ పర్సన్...

Antibody Cocktail: ‘ఒక్కరోజులో కొవిడ్ లక్షణాలు మాయం’

Symptoms Gone In A Day Doctor On Antibody Cocktail To 40 In Hyderabad

Antibody Cocktail: డాక్టర్లు కోవిడ్ ట్రీట్మెంట్‌లో మరో గుడ్ న్యూస్ చెప్పారు. మోనోక్లోనల్ యాంటీబాడీస్ సింగిల్ డోస్ డ్రగ్ కాక్ టైల్ ఇవ్వగానే ఒక్కరోజులో లక్షణాలు దూరమయ్యాయని అంటున్నారు డాక్టర్లు. హైదరాబాద్ ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ హాస్పిటల్ ఛైర్ పర్సన్ డా. నాగేశ్వర్ రెడ్డి 40 మంది కొవిడ్ పేషెంట్లకు చేసిన ట్రీట్మెంట్ గురించి ఇలా అంటున్నారు.

‘ఒక 24 గంటల్లోనే క్లినికల్ లక్షణాలు అయిన జ్వరం, అనారోగ్యం వంటి వాటి నుంచి రికవరీ అయ్యారని’ అన్నారు. బాగా ఇన్ఫెక్షన్ కు గురి చేస్తున్న డెల్టా వేరియంట్‌పై ప్రస్తుత థెరఫీ ఎంత ప్రభావం చూపిస్తుందోననే స్టడీ నిర్వహిస్తున్నారు.

‘అమెరికాలో జరిపిన స్టడీ ప్రకారం.. బ్రిటీష్ వేరియంట్, బ్రెజిల్ వేరియంట్, దక్షిణాఫ్రికా వేరియంట్లపై ఈ థెరఫీ చాలా ప్రభావవంతంగా పనిచేసింది. డెల్టా వేరియంట్ పై మాత్రం ఇంకెవ్వరూ పరీక్షలు జరపలేదు. అందుకే దాంతో పాటు మ్యుటెంట్ వైరస్ పై కూడా సమాంతరంగా పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఫలితాల్లో 40 మంది కొవిడ్ రోగుల ఫలితాలను విశ్లేషించాం. 100శాతం కేసుల్లో వైరస్ కనుమరుగైనట్లు తెలుస్తుందని ఆర్టీ-పీసీఆర్ పరీక్ష ద్వారా నిర్థారించాం’ అని డా.రెడ్డి అన్నారు.

ఈ థెరఫీ రోగుల్లో కనిపిస్తున్న మోడరేట్ లక్షణాలను తగ్గిస్తుంది. అమెరికా మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కు నిర్వహించిన తర్వాతే ఈ ట్రీట్మెంట్ వెలుగులోకి వచ్చింది. ఇన్ఫెక్షన్ సోకిన 3నుంచి ఏడు రోజుల లోపే యాంటీబాడీస్ కాక్ టైల్ ఇంజెక్షన్ ఇవ్వాలి. దీని ఖర్చు దాదాపు రూ.70వేల వరకూ ఉండొచ్చని అంటున్నారు.