Naina Jaiswal Facing Harassment : టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్‌కు సోషల్‌మీడియాలో వేధింపులు

ప్రముఖ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్‌ ను ఓ యువకుడు సోషల్ మీడియాలో వేధింపులకు గురిచేశారు. సోషల్ మీడియాలో నైనా జైస్వాల్‌ను శ్రీకాంత్ అనే యువకుడు వేధిస్తున్నారు. వేధింపులకు పాల్పడుతున్న యువకుడు శ్రీకాంత్ ను పోలీసులు అరెస్టు చేశారు. పలు సెక్షన్ల కింద అతనిపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు.

Naina Jaiswal Facing Harassment : టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్‌కు సోషల్‌మీడియాలో వేధింపులు

Naina Jaiswal Facing Harassment

Naina Jaiswal Facing Harassment : సోషల్ మీడియాలో వేధింపులు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ప్రముఖులను టార్గెట్ చేస్తూ ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. ప్రముఖ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్‌ ను ఓ యువకుడు సోషల్ మీడియాలో వేధింపులకు గురిచేశారు. సోషల్ మీడియాలో నైనా జైస్వాల్‌ను శ్రీకాంత్ అనే యువకుడు వేధిస్తున్నారు. ఇన్ స్టా గ్రామ్ లో నైనా జైస్వాల్ కు అసభ్యకర మెసేజ్ లు పంపి వేధిస్తున్నారు.

ఆ యువకుడిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. వేధింపుల మెసేజ్ లను స్క్రీన్ షార్ట్స్ తీసి పోలీసులకు అందించారు. వేధింపులకు పాల్పడుతున్న యువకుడు శ్రీకాంత్ ను పోలీసులు అరెస్టు చేశారు. పలు సెక్షన్ల కింద అతనిపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు.

Tamil Nadu: పదేళ్లుగా విద్యార్థినులపై లైంగిక వేధింపులు.. టీచర్‌పై కేసు నమోదు

గతంలో కూడా శ్రీకాంత్ వేధించాడని నైనా జైస్వాల్‌‌ తెలిపారు. అప్పట్లో శ్రీకాంత్ కు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. అయినా తీరుమారని శ్రీకాంత్ ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో అసభ్యకరమైన మెసేజ్‌లు పెట్టి నైనా జైస్వాల్‌‌ను వేధిస్తున్నాడు. దీంతో నైనా తండ్రి మరోసారి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అయితే గతంలోనే సోషల్‌మీడియాలో నిందితుడు శ్రీకాంత్‌ ఇలా వేధించాడని.. అప్పుడు సిద్దిపేట పోలీసులు కౌన్సిలింగ్‌ ఇచ్చారని నైనా తండ్రి అశ్వానీ జైస్వాల్‌ తెలిపారు. అయినా శ్రీకాంత్‌ తీరులో ఏ మార్పు రాలేదన్నారు. శ్రీకాంత్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ పోలీసులపై పూర్తి నమ్మకం ఉందని అన్నారు.
Sexually Assaulting : విద్యార్థినులపై లైంగిక వేధింపులు..50 ఏళ్ల మాస్టారికి 79 ఏళ్ల జైలుశిక్ష

హైదరాబాద్‌కు చెందిన నైనా జైస్వాల్ దేశంలో ప్రముఖ టేబుల్ టెన్నిస్ స్టార్ క్రీడాకారుల్లో ఒకరు. అంతర్జాతీయ క్రీడాకారిణిగా నైనా జైస్వాల్ రాణిస్తున్నారు. నైనా జాతీయ, అంతర్జాతీయ ఛాంపియన్‌షిప్‌లలో పలు టైటిళ్లు గెలుచుకుంది. గత ఫిబ్రవరి నెలలో జైస్వాల్ ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్ కావడంతో అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు.