Minister Malla reddy : అట్లుంటది ఆయనతోని..మంత్రి మల్లారెడ్డి కార్మిక శాఖ..కామెడీగా మారిపోయిందా? Minister Mallareddy does not have a proper insult to the Ministry of Labor

Minister Malla reddy : అట్లుంటది ఆయనతోని..మంత్రి మల్లారెడ్డి కార్మిక శాఖ..కామెడీగా మారిపోయిందా?

మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి..మంత్రి మల్లారెడ్డి ఒక్కసారి కూడా తన కార్మిక శాఖ గురించి రివ్యూ చేయలేదు. దీనికి తోడు.. అదే శాఖలో ఉన్న కీలక అధికారితో.. అసలే పొసగడం లేదు. ఆయన స్టేజీ మీద కామెడీలు చేసినట్లు.. ఆయనకు కేటాయించిన కార్మిక శాఖ కూడా కామెడీగా మారిపోతుందన్న ఆందోళన.. కార్మికులను వెంటాడుతోంది.

Minister Malla reddy : అట్లుంటది ఆయనతోని..మంత్రి మల్లారెడ్డి కార్మిక శాఖ..కామెడీగా మారిపోయిందా?

Telangana minister Malla reddy : మల్లారెడ్డి.. మంత్రి మల్లారెడ్డి. కామెడీ స్పీచులు దంచాలన్నా.. ఖతర్నాక్ పంచులు పేల్చాలన్నా.. ఇప్పుడున్న కేబినెట్‌లో సారే తోపు. వీలైతే ఆపు. ఆపలేవ్. ఆయన మైక్ పట్టుకుంటే తట్టుకోలేవ్. మైకు దొరికితే.. ఓ పట్టు బట్టే మల్లారెడ్డికి.. ఆయన శాఖ మీదే పట్టు తప్పిందన్న టాక్ వినిపిస్తోంది. మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి.. ఒక్కసారి కూడా పూర్తి స్థాయిలో రివ్యూ చేయలేదు. దీనికి తోడు.. అదే శాఖలో ఉన్న కీలక అధికారితో.. అసలే పొసగడం లేదు. ఆయన స్టేజీ మీద కామెడీలు చేసినట్లు.. ఆయనకు కేటాయించిన కార్మిక శాఖ కూడా కామెడీగా మారిపోతుందన్న ఆందోళన.. కార్మికులను వెంటాడుతోంది.

తెలంగాణ కేబినెట్‌లో.. మంత్రి మల్లారెడ్డి వెరీ స్పెషల్. నేను మల్లారెడ్డి.. అంటూ దంచే స్పీచ్‌లు.. ఆయన కంటే ఫేమస్. టీడీపీ నుంచి ఎంపీగా గెలిచి.. 2018లో టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తక్కువ టైంలోనే.. అధికార పార్టీలో మంత్రిగా ఎదిగారు. 2019 ఫిబ్రవరి నుంచి కార్మికశాఖ మినిస్టర్‌గా కొనసాగుతున్నారు. అప్పటి నుంచి తన శాఖపై పూర్తి స్థాయిలో రివ్యూ కూడా చేయలేదని అధికార వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నారు. దీనికి తోడు.. సంబంధిత శాఖకు పూర్తి స్థాయిలో కమిషనర్ లేరు. ఇండస్ట్రీస్, మైనార్టీ వెల్ఫేర్ కమిషనర్‌‌గా ఉన్న నదీమ్ అహ్మద్.. కార్మికశాఖకు ఇంచార్జ్ కమిషనర్‌గా వ్యవహరిస్తున్నారు.

అయితే.. మంత్రి మల్లారెడ్డికి, ఇంచార్జ్ కమిషనర్‌ అహ్మద్‌కు.. కొంతకాలంగా పొసగడం లేదని.. కార్మికశాఖ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయ్. అదనపు బాధ్యతలు ఉండటం వల్ల అహ్మద్ కార్మిక శాఖపై దృష్టి పెట్టలేకపోతున్నారని.. దీంతో లేబర్ మినిస్టర్ డమ్మీగా మారారనే గుసగుసలు వినిపిస్తున్నాయ్. ఎక్కడ స్టేజ్ ఎక్కినా.. ఆవేశంతో ఊగిపోవడం.. సీరియస్‌గా కామెడీ స్పీచులు దంచడం తప్ప.. శాఖపై పూర్తి స్థాయిలో పట్టు సాధించలేకపోయారనే ముద్ర మల్లారెడ్డిపై పడిపోయింది.

రాష్ట్రంలో 75వ షెడ్యూల్‌లో 2 కోట్ల మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. వీరంతా.. జీతాలు పెంచాలని కొన్ని నెలలుగా మంత్రి చుట్టూ.. కమిషనర్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ఫలితం లేదు. ఇప్పటివరకు.. దీనికి సంబంధించిన ఫైల్‌ను ప్రభుత్వం దగ్గరకు పంపలేదని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయ్. కనీస వేతనాల సలహా మండలి సైతం.. చాలా సార్లు మంత్రి దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదు. మంత్రి మల్లారెడ్డి-కమిషనర్ మధ్య నెలకొన్న సమన్వయ లోపంతో.. కార్మికులు నలిగి పోతున్నారని.. డిపార్ట్ మెంట్ ఉద్యోగుల్లో చర్చ నడుస్తోంది.

ఇప్పటికీ.. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న జీతాలనే కొన్ని ప్రైవేట్ సంస్థలు అమలు చేస్తున్నాయ్. ప్రైవేట్ యాజమాన్యాలకు మేలు చేయడం కోసమే.. మంత్రి మల్లారెడ్డి ఫైల్స్‌ని పెండింగ్ పెడుతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ ఐదేళ్లలో లేబర్ సమస్యలపై.. ప్రభుత్వం కేవలం ఐదు జీవోలు మాత్రమే చేసింది. ఐదేళ్లకోసారి పెంచాల్సిన కనీస వేతనాలపై.. పదులసార్లు మంత్రికి, కమిషనర్‌కు.. లేఖలు ఇచ్చాయి కార్మిక సంఘాలు. అయినా.. సమస్య పరిష్కారం కావడం లేదు. ఇంత పెద్ద శాఖకు పూర్తి స్థాయిలో కమిషనర్ లేకపోవడం కూడా ఇందుకు ఓ కారణంగా చూపుతున్నారు. మంత్రి దగ్గర ఓఎస్డీగా పనిచేసే ఓ అధికారి.. అటు మంత్రికి, ఇటు కమిషనర్‌కు సమన్వయకర్తగా ఉంటూ.. ఇద్దరి మధ్య గ్యాప్‌కు కారణమవుతున్నారని.. కార్మికశాఖలో చర్చ జరుగుతోంది.

ఇంచార్జ్ కమిషనర్ కనీసం వారానికొకసారైనా.. లేబర్ కమిషనర్ ఆఫీసుకు రాకపోవడంతో.. ఫైల్స్ అన్నీ పెండింగ్‌లో పడిపోతున్నాయి. మంత్రి మల్లారెడ్డి కూడా.. విద్య, వైద్య, వ్యాపార సంస్థల్లో పనిచేస్తున్న వందలాది కార్మికుల.. కార్మిక హక్కులను కూడా కాపాడలేకపోతున్నారనే విమర్శలొస్తున్నాయ్. తమ హక్కులను.. తుంగలో తొక్కుతున్నారని.. కార్మికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా.. మంత్రి మల్లారెడ్డి శాఖపై దృష్టి పెట్టి.. సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు.

 

×