లాక్‌డౌన్ తర్వాత ట్రాఫిక్ పోలీసులకు మరో చిక్కు

  • Published By: Subhan ,Published On : June 7, 2020 / 10:51 AM IST
లాక్‌డౌన్ తర్వాత ట్రాఫిక్ పోలీసులకు మరో చిక్కు

ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసినా.. నిర్లక్ష్యం చేసి పట్టించుకోకపోయినా నెంబర్ ప్లేట్ ఆధారంగా వెహికల్స్‌కు జరిమానా విధిస్తున్నారు ట్రాఫిక్ పోలీస్ వారు. అలాంటిది ఇప్పుడు కొత్త సమస్య మొదలైంది ట్రాఫిక్ పోలీసులకు. వాహనానికి ఉండే నెంబరుకు రిజిస్ట్రేషన్ అయిన నెంబరుకు సంబంధమే ఉండడం లేదు. ట్రాఫిక్ రూల్స్ మీరి ప్రయాణిస్తున్న వారికి బదులుగా నెంబర్ ప్లేట్ యజమానికి నోటీసులు వెళ్తున్నాయి. 

కాపాడాలంటూ బాధితులు ట్రాపిక్ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. తమ వాహనాలు ఎటూ ప్రయాణించకపోయినా తప్పుడు కంప్లైంట్ లతో బిల్లులు వస్తున్నాయని ఆరోపిస్తున్నారు. కొద్ది రోజుల ముందు సికింద్రాబాద్ లోని ఓ వ్యక్తి హెల్మెట్ లేకుండా వాహనం నడుపుతుండటంతో పోలీసులు రూ.100ఫైన్ విధించినట్లు మెసేజ్ వచ్చింది

వచ్చిన మెసేజ్‌ను బట్టి నెంబర్‌పై రిజిస్ట్రేషన్ అయి ఉన్న బైక్ యాక్టివా. ఇక్కడ నడుపుతుంది మాత్రం కొత్త మోడల్ బైక్. అంటే ఉప్పల్ క్రాస్ రోడ్లో డ్రైవింగ్ చేస్తూ ఎలాంటి రూల్స్ బ్రేక్ చేసినా స్కూటీ ఓనర్‌కే ఫైన్ పడేది. ఇలాంటి మెసేజ్‌లు వచ్చినప్పుడు వాటిని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లలో చూపిస్తే నెంబర్ ప్లేట్ యజమానులు ఫైన్ లు చెల్లించాల్సిన అవసరముండదు. 

‘ఎవరైతే తప్పుడు నెంబర్ ప్లేట్ అమర్చుకుని డ్రైవింగ్ చేస్తున్నారో.. వాళ్లు పట్టుబడినప్పుడు సెక్షన్ 420 ప్రకారం.. చీటింగ్ కేసు నమోదు చేస్తాం’ అని ఓ అధికారి అన్నారు. ట్యాంపర్డ్ నెంబర్ ప్లేట్ తో డ్రైవింగ్ చేసే వారిని పట్టుకునేందుకు రాచకొండ పోలీస్ కమిషనరేట్ లో ఓ ప్రత్యేక సాఫ్ట్ వేర్ కూడా రెడీ చేస్తున్నారు. 

ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించేవారిపై రోజూ 4వేల చలాన్లు ఫైల్ అవుతున్నాయి. వాటిలో కనీసం 3ట్యాంపర్డ్ చలాన్లు ఉంటున్నాయి. లేదా ఫేక్ నెంబర్లు ఉంటున్నాయి. 2019 మొత్తంలో హైదరాబాద్ పోలీసులు లక్షా 15వేల 122కేసులు నమోదైనట్లు గుర్తించారు.