TSRTC: నాలుగు నెలలే టార్గెట్.. గాడిన పడకపోతే ప్రైవేట్ పరమే!

నాలుగు నెలలే టార్గెట్.. ఈలోగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) గాడిన పడకపోతే ఇక ప్రైవేట్ పరమే మిగిలిందని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. ఆర్టీసీ ఎదుర్కొంటున్న ఇబ్బందులు..

TSRTC: నాలుగు నెలలే టార్గెట్.. గాడిన పడకపోతే ప్రైవేట్ పరమే!

Tsrtc

TSRTC: నాలుగు నెలలే టార్గెట్.. ఈలోగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) గాడిన పడకపోతే ఇక ప్రైవేట్ పరమే మిగిలిందని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. ఆర్టీసీ ఎదుర్కొంటున్న ఇబ్బందులు, పునర్వైభవానికి తీసుకోవాల్సిన చర్యలపై మంగళవారం సీఎం కేసీఆర్ సమక్షంలో సమీక్షా సమావేశం జరిగింది. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్‌, ఎండీ సజ్జనార్​లు కూడా ఈ సమావేశంలో పాల్గొనగా పలు కీలక అంశాలపై చర్చించారు.

Manike Mage Hithe: బెంగాలీలో మార్మోగుతున్న ‘దీదీ’ ‘మా మాతి మనుష్‌ హితే’ పాట!

ఆర్టీసీని రక్షించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అనేకసార్లు ఆదుకుందని.. ఈ ఏడాది కూడా ప్రణాళిక, ప్రణాళికేతర నిధుల కింద మూడు వేల కోట్లు కేటాయించిందని.. అయినప్పటికీ ఆశించిన స్థాయిలో ఫలితాలు ఉండడం లేదని సీఎం కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అందరూ కలిసికట్టుగా పనిచేస్తేనే ఆర్టీసీ మనుగడ సాధ్యమవుతుందని సీఎం కేసీఆర్ అధికారులకు దిశానిర్దేశం చేసినట్లు ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్ స్పష్టం చేశారు.

Chiranjeevi: మెగాస్టార్ దూకుడు.. జెట్ స్పీడ్‌తో సినిమాలు షురూ!

మరో నాలుగు నెలల్లో ఆర్టీసీని గాడిన పెట్టాలనే లక్ష్యంతో ప్రణాళికలు రచిస్తున్నారు. యుద్ధప్రాతిపదికన దిద్దుబాటు చర్యలు చేపట్టి సంస్థను గాడినపెట్టాలని స్పష్టం చేసిన సీఎం.. కరోనాతో పాటు పెరిగిన డీజీల్ ధరలు ఆర్టీసీ నష్టాలకు కారణమైనట్లు అధికారులు వివరించారు. కార్యాలయాల్లో కూర్చుని పనిచేస్తే కుదరదని, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలు తెలుసుకోవాలని అప్పుడే సంస్థ బాగుపడుతుందని ఆర్టీసీ అధికారులకు స్పష్టం చేశారు. కార్యాలయంలో కూర్చుంటే క్షేత్రస్థాయిలో సమస్యలు అర్ధం కావని అందుకే.. ఇకపై అధికారులు ఫీల్డ్ లోకి దిగి పనిచేయాలన్నారు.